Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

Advertiesment
Praveen, Sudheer Babu at Bakasura Restaurant pre release

దేవీ

, శనివారం, 2 ఆగస్టు 2025 (16:56 IST)
Praveen, Sudheer Babu at Bakasura Restaurant pre release
ప్రవీణ్‌ నాకు వన్‌ఆఫ్‌ ఫేవరేట్‌ యాక్టర్‌. నన్ను ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతాను. ఏ సినిమా అయినా ఎలా సక్సెస్‌ చేయాలో తపన పడుతుంటాడు. ప్రవీణ్‌ ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడు. మంచి నటుడే కాదు మంచి వ్యక్తి కూడా. అందరి మంచి కోరుకుంటాడు. ఈ సినిమాను వినోదమే ధ్యేయంగా నిర్మించిన నిర్మాతకు అభినందనలు.  ఓ ఫ్యామిలీలా కలిసి ఈ సినిమాను ఎంజాయ్‌ చేయాలి అని సుధీర్‌ బాబు అన్నారు.
 
కమెడియన్‌ ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌', ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు.  కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మించారు. ఆగస్టు 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమౌతుంది. కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈవేడుకకు హీరో సుధీర్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
 
నిర్మాత జనార్థన్‌ మాట్లాడుతూ '' ఈ సినిమాకు కథే హీరో.. మంచి కథను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు... నటుడు ప్రవీణ్‌, వైవా హర్ష.. ఇలా అందరం కలిసి బకాసుర రెస్టారెంట్‌లో మంచి డిష్‌ను ప్రిపేర్‌ చేశాం. అందరికి మా డిష్‌. అంటే మా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. మా సినిమాను దిల్‌ రాజు బ్యానర్‌ ఎస్‌వీ ద్వారా విడుదల చేస్తున్నాం '' అన్నారు.
 
దర్శకుడు ఎస్‌ జే శివ మాట్లాడుతూ '' విరూపాక్షకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఆ సినిమా వల్లే నేను దర్శకుడినయ్యాను. ఆ సినిమా మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది. నా గురించి మా అన్నయ్య నిర్మాతగా మారాడు. ఈ కథకు మంచి సంగీతం కుదిరింది. వికాస బడిస భవిష్యత్‌లో పెద్దసంగీత దర్శకుడవుతాడు. ప్రవీణ్‌ మా కథను ఒప్పుకోవడం ఈ సినిమా రూపొందడానికి ప్రధాన కారణం. కథకు తగిన విధంగా టాలెంటెడ్‌ నటీనటులను ఎంపిక చేసుకున్నాను. ఈ చిత్రంలో వైవా హర్ష, ఫణిల పాత్రలు కూడా ఎంతో బాగుంటాయి.  ట్రైలర్‌కు మించిన విధంగా సినిమా ఉంటుంది. ఈ సినిమాలో చాలా సర్‌ఫ్రైజ్‌లు ఉంటాయి.అందరూ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది. అందరిని కడుపుబ్బ నవ్వించే ఫ్యామిలీ అండ్‌ హంగర్‌ ఎంటర్‌టైనర్‌గా అందర్ని అలరిస్తుంది' అన్నారు.
 
ప్రవీణ్‌ మాట్లాడుతూ '' మా జీవితాలకు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచిన ప్రేమకథా చిత్రమ్‌ హీరో అతిథిగా రావడం ఆనందంగా ఉంది. నన్ను నమ్మి కథలో నన్ను ప్రధాన వస్తువుగా సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. వికాస బడిస సంగీతం టాక్‌ఆఫ్‌ ది టౌన్‌, టెక్నిషియన్స్‌ అందరూ ది బెస్ట్‌ ఇచ్చారు. శివ కథ చెప్పినప్పుడే గ్యారంటీగా బాగా తీయగలడు అనే నమ్మకం కలిగింది. బకాసుర రెస్టారెంట్‌ ఇంటిల్లాపాఇది చూడాల్సిన ఎంటర్‌టైనర్‌ అండ్‌ ఎమోషనల్‌ ఫిల్మ్‌ అన్నారు.  ఈ కార్యక్రమంలో సత్యం రాజేష్‌,  షైనింగ్‌ ఫణి, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌ పటాస్‌, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్‌, డిఓపీ బాల సరస్వతి, సంగీత దర్శకుడు వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)