యాంకర్, నటి అనసూయకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. ఓ ప్రైవేటు ఫంక్షన్లో పాల్గొనేందుకు ప్రకాశం జిల్లా మార్కాపురం వచ్చిన ఆమెను కొందరు ఆకతాయిలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. దీనితో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
అనసూయ మాట్లాడుతూ... చెప్పు తెగుద్ది. మీకోసం 7 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తే మీరు చూపించే మర్యాద ఇదేనా. మీ చెల్లి, మీ తల్లి, మీ కాబోయే భార్యను ఇలాగే ఎగతాళి చేయగలరా. మీ వ్యవహార శైలి నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇలాంటివారు ఇక్కడ వద్దు వెళ్లిపోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనసూయ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.