Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

Advertiesment
Sudheer Babu Jatadhara Look

దేవీ

, సోమవారం, 4 ఆగస్టు 2025 (17:46 IST)
Sudheer Babu Jatadhara Look
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్ లో జీ స్టూడియోస్ , ప్రెర్నా అరోరా ఎస్ కే గీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మైథికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'జటాధర' ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. భారతీయ పురాణాల్ని అద్భుతమైన గ్రాఫిక్స్‌తో బ్లెండ్ చేస్తూ, విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  
 
Sonakshi Sinha Jatadhara Look
పోస్టర్ అద్భుతంగా వుంది. మానవాళి vs దైవత్వం, శాపం vs శక్తి మధ్య సంగ్రామానికి చిహ్నంగా నిలిచింది. మెరుపుల మధ్య ఆకాశాన్ని చీల్చుకుంటూ త్రిశూలం దూసుకెళ్తుంటే, సుధీర్ బాబు యుద్ధానికి సిద్ధమవుతాడు. అతని వెనుక ఉగ్ర శివుడి రూపం కనిపిస్తుంది. ఈ ఫస్ట్ సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచింది. టీజర్ ఆగస్ట్ 8, 2025న వస్తోంది.
 
ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. వరల్డ్ క్లాస్ గ్రాఫిక్స్, ఏఐ-ఎన్‌హాన్స్‌డ్ స్టోరీటెల్లింగ్, గొప్ప స్క్రీన్‌ప్లే తో సిమిమా విజువల్ గ్రాండియర్ గా వుండబోతుంది. మ్యూజిక్ జీ మ్యూజిక్ కో మ్యూజిక్ లో రూపొందుతోంది. సినిమా ఏడాదిలోనే పాన్ ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది.
 
జీ స్టూడియోస్ ఇప్పటికే ఎన్నో విభిన్న కథలతో ఆకట్టుకుంది. ఈ ప్రాజెక్టు ను జీ స్టూడియోస్ సీబీవో ఉమేష్ కుమార్ బన్స్‌ల్ ఆయన విజన్, స్పెషల్ కాన్సెప్ట్‌ల మీద ఆసక్తి, ఈ సినిమాని ప్రత్యేకంగా నిలిపేలా చేస్తోంది.
 
ప్రెర్నా అరోరాకి ఇది జీ స్టూడియోస్‌తో రెండవ భారీ ప్రాజెక్ట్. ఇంతకుముందు "రుస్తమ్"తో పని చేశారు. "టాయిలెట్: ఎక్ ప్రేమ్ కథ", "ప్యాడ్‌మ్యాన్", "పరి", "బట్టి గుల్ మీటర్ చాలు" వంటి అవార్డు విన్నింగ్ సినిమాలను కూడా నిర్మించారు.
 
జటాధర సినిమాను ఉమేష్ కుమార్ బన్స్‌ల, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రెర్నా అరోరా, శిల్పా సింగాల్, నిఖిల్ నందా కలిసి నిర్మిస్తున్నారు. సహ నిర్మాతలుగా అక్షయ్ కేజ్రీవాల్, కుసుమ్ అరోరా ఉండగా,  దివ్య విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్