Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

Advertiesment
Walkathon

ఐవీఆర్

, బుధవారం, 3 డిశెంబరు 2025 (16:43 IST)
హైదరాబాద్: ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్ దిశా వాకథాన్ 2025ను హెచ్ఏసిహెచ్ సువిటాస్ నేడు సంజీవయ్య పార్క్‌లో నిర్వహించింది. శాశ్వత వైకల్యం తరచుగా నివారించదగినది. నిర్మాణాత్మక రీహాబిలిటేషన్ ముందుగానే ప్రారంభించి దానిని స్థిరంగా కొనసాగిస్తే మొబిలిటీ, స్వేచ్ఛను పునరుద్ధరించగలదు అంటూ భారతదేశం వ్యాప్తంగా కుటుంబాలు, వైద్యులు, విధాన రూపకర్తలకు ఈ కార్యక్రమం స్పష్టమైన సందేశాన్ని అందించింది. 
 
ఈ వాకథాన్లో 50 మంది దివ్యాంగులు, 50 మంది వాలంటీర్లు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ వాకథాన్ తర్వాత, సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్-రికవరీ నిపుణులు గైటర్‌తో సహా రోబోటిక్ మొబిలిటీ సిస్టమ్‌లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హెచ్ఏసిహెచ్ అధ్యక్షుడు- సహ వ్యవస్థాపకుడు డాక్టర్ గౌరవ్ తుక్రాల్ మాట్లాడుతూ, భారతదేశంలో వైకల్యం అనగానే, అది శాశ్వతమని భావించబడుతుంది, కానీ ఈ వైకల్యంలో చాలావరకూ నివారించదగినది. రీహాబిలిటేషన్ సకాలంలో ప్రారంభమైనప్పుడు, నిర్మాణాత్మక ప్రోటోకాల్‌ను అనుసరించినప్పుడు, రోబోటిక్స్‌ మద్దతు లభించినప్పుడు, రోగులు త్వరగా కోలుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆసుపత్రి వాతావరణం వెలుపల ఈ కోలుకోవడం కనిపించేలా చేయడానికి దిశా వాకథాన్ నిర్వహించాము అని అన్నారు. 
 
హెచ్ఏసిహెచ్ అధ్యక్షుడు, సహవ్యవస్థాపకుడు అంకిత్ గోయెల్ మాట్లాడుతూ, భారతదేశంలో వైకల్యాన్ని అర్థం చేసుకునే తీరు పరంగా మార్పు అవసరం. నిజమైన వ్యక్తులు, సాంకేతికత, పురోగతిని ఉపయోగించి వైకల్యం శాశ్వతం కాదనే సత్యాన్ని ప్రజల దృష్టిలోకి ఈ వాకథాన్ తీసుకువచ్చింది. నివారించదగిన వైకల్యాన్ని నిజంగా నివారించడానికి భారతదేశం ఇప్పుడు రీహాబిలిటేషన్ ను ప్రధాన స్రవంతి ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతగా మార్చాలి అని అన్నారు. 
 
హెడ్-కాన్సెప్ట్- క్లినికల్ ఎక్సలెన్స్, హెచ్ఏసిహెచ్ సువిటాస్ డాక్టర్ విజయ్ జనగామ మాట్లాడుతూ, శాశ్వత వైకల్యం అనేది తరచుగా ఆలస్యం లేదా అసంపూర్ణ రీహాబిలిటేషన్ ఫలితంగా ఉంటుంది. మొబిలిటీ, దీర్ఘకాలిక పనితీరును రక్షించడానికి రీహాబిలిటేషన్ ఐచ్ఛికం కాదు, తప్పనిసరి అని నేటి వాకథాన్ పునరుద్ఘాటించింది అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది