Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Advertiesment
Nayanatara, chiru - shashireka song

దేవి

, గురువారం, 4 డిశెంబరు 2025 (12:26 IST)
Nayanatara, chiru - shashireka song
ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు  నుండి మరొక చార్ట్‌బస్టర్ పాటకు దారి సుగమం అయింది. ఇప్పటకే మొదటి సాంగ్ విడుదలై ఆదరణ పొందింది. తాజాగా రెండవ సింగిల్  శశిరేఖ లిరికల్ వీడియో డిసెంబర్ 8న రాబోతుంది. వెంకటేష్ పై తీసిన పాట పూర్తి అయింది. నేటి నుంచి చిరంజీవి, నయనతార పై సాంగ్ చిత్రీకరిస్తున్నారు. తాజాగా గత నెలలో తెసిన సాంగ్ కు కొనసాగింపుగా ఉంటుందని తెలిస్తోంది. 
 
భీమ్స్ సిసిరోలియో మ్యూజికల్ గా రాబోతుంది. ఇందులో చిరంజీవి తనదైన్ స్టెప్పులతో స్టైలిష్ గా డాన్స్ ఉంటున్నది అని చిత్ర టీం చెపుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేస్తూ వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే  మీసాల పిల్ల సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. చిరంజీవి సోషల్ మీడియాలో తెలుపుతూ, అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్  డిసెంబర్ 8న రాబోతుంది అని పేర్కొన్నారు. 
 
కాగా, విక్టరీ వెంకటేష్, కేథరిన్ ట్రెసా  నటిస్తున్నారు.. అనిల్ రావిపూడి దర్శకత్యంలో సాహూగరపాటి,  సుష్మిత  కొనిదెల, అర్చన నిర్మిస్తున్నారు. షైన్ స్క్రీన్ బేనర్ లో రూపొందుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2