వివాదంలో పాక్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్.. ఏమైంది?

సెల్వి
మంగళవారం, 18 జూన్ 2024 (19:20 IST)
Haris Rauf
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ భిన్నమైన వివాదంలో చిక్కుకున్నాడు. అతని వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. 
 
అందులో అతడు గొడవ ప‌డుతూ కనిపించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో హరీస్ రవూఫ్ తన భార్యతో కలిసి కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమానితో వాగ్వాదానికి దిగాడు. హరీస్ హఠాత్తుగా భార్య చేయి విడిపించుకుని ఫ్యాన్ వైపు పరుగెత్తడం వీడియోలో కనిపిస్తోంది. బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు గ్రూప్ దశలో అమెరికా, భారత్‌తో మ్యాచ్‌ల‌లో ఓడిపోవడంతో టోర్నమెంట్ నుండి త్వరగా నిష్క్రమించాల్సి వచ్చింది.
 
ఇకపోతే.. పాకిస్థాన్ టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమిస్తే బాబర్ ఆజమ్‌ జట్టులో చోటుకు అర్హుడు కూడా కాదని వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించాడు. ఒక కెప్టెన్‌గా తన ఆట జట్టుకు ఉపయోగపడుతుందో లేదో ఆలోచించుకోవాలని, టీ20 క్రికెట్‌లో బాబర్ ప్రదర్శన, స్ట్రైక్-రేట్ అంత గొప్పగా లేవని ప్రస్తావించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థినికి 60 మార్కులు వస్తే 5 మార్కులుగా చూపించిన లెక్చరర్, డిబార్ చేసిన అధికారులు

అమ్మా క్యాంటీన్లలో రుచికరమైన ఆహారం అందించండి.. సీఎం విజయ్ ఆదేశాలు

నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ - ఎన్టీఏ అధికారులకు సమన్లు

రోడ్లపై నమాజ్ చేస్తే ఊరుకోం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

స్కార్పియో, పది లక్షలు, బంగారం, 16 ఉంగరాలు ఇచ్చినా సరిపోలేదు.. వివాహితను ఏం చేశారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments