Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ కొత్త రూల్ : యూఎస్ఏకు 5 పరుగుల జరిమానా!!

Team India

వరుణ్

, గురువారం, 13 జూన్ 2024 (09:50 IST)
అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సాఫీగా సాగిపోతుంది. ఈ టోర్నీలో భాగంగా, భారత్ - అమెరికా జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ కీలక దశలో అనూహ్య పరిణామం జరిగింది. లక్ష్య ఛేదనలో భారత్‌కు 30 బంతుల్లో 35 పరుగులు అవసరమైన దశలో భారత విజయం లక్ష్యం నుంచి 5 పరుగులను అకస్మాత్తుగా తగ్గించారు. పరుగులు రాబట్టడం క్లిష్టంగా మారిన నసావు కౌంటీ పిచ్‌పై సాధించాల్సిన పరుగుల్లో 5 తగ్గడం భారత్‌కు కలిసొచ్చింది. ఇదేసమయంలో ఆతిథ్య అమెరికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది.
 
ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం.. మ్యాచ్ ఓవర్ల మధ్య సమయం 60 సెకండ్లకు మించకూడదు. ఒక్క నిమిషం వ్యవధిలోనే తదుపరి ఓవర్ మొదలు కావాల్సి ఉంటుంది. దీనిని 'స్టాప్ క్లాక్ రూల్' అని అంటారు. ఈ విషయంలో ఫీల్డింగ్ జట్టు చాలా అప్రమత్తంగా ఉండాలి. 60 సెకన్లలోనే కొత్త ఓవరు మొదలు పెట్టాలనే నిబంధనను ఇన్నింగ్స్ మూడు సార్లు అతిక్రమిస్తే ఆ జట్టు స్కోరు నుంచి 5 పరుగుల పెనాల్టీని విధిస్తారు. అంటే ఆ జట్టు మొత్తం స్కోర్ నుంచి 5 పరుగులను తగ్గిస్తారు. అమెరికా వర్సెస్ భారత్ మ్యాచ్‌లోనూ జరిగింది ఇదే. అమెరికా మొత్తం 110 పరుగులు సాధించగా అందులో 5 పరుగులు సాధించాడు. దీంతో భారత్ విజయ లక్ష్యం 106 పరుగులకు తగ్గింది. దీంతో మరో 10 బంతులు మిగిలి ఉండగానే భారత్ సునాయాసంగా విజయం సాధించింది.
 
కాగా, 5 పరుగులు పెనాల్టీగా విధించడంతో అమెరికా ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ ఆరోన్ జోన్స్ ఆన్-ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ వద్దకు వెళ్లి మాట్లాడాడు. కొత్త నిబంధన గురించి వివరించడంతో అసంతృప్తితో వెనుదిరిగాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన దక్షిణాఫ్రికా