Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : సూపర్-8కు ఐర్లాండ్ - టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్!!

Advertiesment
pakistan batsman

వరుణ్

, శనివారం, 15 జూన్ 2024 (13:23 IST)
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్‌లో పాకిస్థాన్ జట్టుకు తేరుకోలేని షాక్ తగిలింది. ఈ టోర్నీ నుంచి ఆ జట్టు నిష్క్రమించింది. వర్షం కారణంగా శుక్రవారం ఐర్లాండ్ - అమెరికా దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు. ఫలితంగా ఐర్లాండ్ జట్టు ఖాతాలో ఐదు పాయింట్లు చేరాయి. దీంతో ఆ జట్టు సూపర్-8కు చేరుకుంది. మరోవైపు, రెండు పాయింట్లతో ఉన్న పాకిస్థాన్ జట్టు ఇంటికి తిరుగుముఖం పట్టింది. కాగా, భారత క్రికెట్ జట్టు మాత్రం ఇప్పటికే సూపర్-8కు చేరుకున్న విషయం తెల్సిందే. 
 
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న విషయం తెల్సిందే. ఇందులో పాకిస్థాన్‌కు తేరుకోలేని షాక్ తగిలింది. సూపర్ 8 నుంచి ఆ జట్టు నిష్క్రమించింది. శుక్రవారం ఫ్లోరిడాలోని లాడర్హిల్ అమెరికా - ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో పాక్ ఆశలపై నీళ్లు చల్లింది. యూఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. పర్యవసానంగా ఐదు పాయింట్లలో యూఎస్ఏ జట్టు సూపర్-8 దశకు అర్హత సాధించింది.
 
జూన్ 16వ తేదీన ఐర్లాండ్ పాకిస్థాన్ తన చిట్టచివరి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించినా ఆ జట్టు వద్ద 4 పాయింట్లు మాత్రమే ఉంటాయి. గ్రూప్-ఏలో ఇతర జట్లేవీ 5 పాయింట్లు సాధించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికే 5 పాయింట్ల ఉన్న అమెరికా, 6 పాయింట్లతో ఉన్న భారత్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సూపర్-8లోకి అడుగుపెట్టాయి. 
 
కాగా ఫ్లోరిడాలోని లాడర్‌ల్లో యూఎస్ - ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మైదానం చిత్తడిగా ఉన్న కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే ఈ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. నిర్దేశిత సమయం వేచిచూసిన తర్వాత కూడా మ్యాచ్ నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు రద్దు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ టీ20 వరల్డ్ : సౌతాఫ్రికా ఆశలను గల్లంతు చేసిన నేపాల్!!