Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీ20 వరల్డ్ కప్ : పాకిస్థాన్ ఆశలు గల్లంతేనా? ఆతిథ్య జట్టు ఓడిపోవాలని ప్రార్థనలు!

pakistan team

వరుణ్

, శుక్రవారం, 14 జూన్ 2024 (13:36 IST)
అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ ఆశలు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ టోర్నీలో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‍‌లలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‍‌లో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సూపర్-8కు చేరడం సంక్లిష్టంగా మారింది. ఆ జట్టు ఆశలు సజీవంగా నిలవాలంటే ఐర్లాండ్‌‍తో జరిగే చివరి మ్యాచ్‌లో ఖచ్చితంగా విజయం సాధించాల్సివుంది. అయితే, ఆదివారం జరుగాల్సిన ఈ మ్యాచ్‌పై సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఫ్లోరిడాలో భారీ వర్షాలతో వీధులన్నీ వరద నీటితో నిండిపోయాయి. అలాగే, స్టేడియం ఉన్న బ్రోవార్డ్ కౌంటీలోనూ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 
 
ఒక వేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయితే పాయింట్లను ఇరు జట్లకు సమానంగా కేటాయిస్తారు. అపుడు పాకిస్థాన్ ఖాతాలో మూడు పాయింట్లు వచ్చి చేరుతాయి. అదే జరిగితే దాయాది దేశం ఇంటికి ప్రయాణం కావాల్సివుంది. ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు ఎలాంటి ఆటంకం కలిగించకుండా మ్యాచ్ కొనసాగి, పాకిస్థాన్ విజయం సాధిస్తే మాత్రం పాక్ ఆశలు సజీవంగా ఉంటాయి. అలా కాకుండా వర్షంతో మ్యాచ్ రద్దు అయితే ఇంటికి చేరుకోవాల్సి ఉంటుంది. 
 
మరోవైపు, శుక్రవారం ఇదే మైదానంలో ఆతిథ్య యూఎస్ఏ జట్టు ఐర్లాండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు విజయం సాధించినా, లేక వర్షంతో మ్యాచ్ రద్దు అయినా ఆరు లేదా ఐదు పాయింట్లతో సూపర్-8కు చేరుతుంది. అందుకే శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఓడిపోవాలని పాక్ ఆటగాళ్లు దేవుడిని ప్రార్థిస్తున్నారు. 
 
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : నెదర్లాండ్స్‌పై బంగ్లా విజయం.. సూపర్-8 ఆశలు పదిలం 
 
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా, గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు నెదర్లాండ్స్ జట్టుపై విజయభేరీ మోగించింది. దీంతో బంగ్లాదేశ్ తన సూపర్-8 ఆశలను మరింతగా మెరుగుపరుచుకుంది. గ్రూపు-డిలో తమకు పోటీగా ఉన్న నెదర్లాండ్స్‌పై బంగ్లా ఆటగాళ్లు 25 పరుగుల తేడాతో గెలుపొందారు. ప్రస్తుతం నాలుగు పాయింట్లో ఉన్న ఈ జట్టు తన చివరి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. 
 
ఇదిలావుంటే, గురువారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా జట్టులో ఆటగాడు షకీబ్ అల్ హాసన్ 46 బంతుల్లో 9 ఫోర్లతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పేసర్‌ రిషాద్‌ హొస్సేన్‌ (3/33) కీలక వికెట్లతో దెబ్బతీశాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. తన్‌జీద్‌ హసన్‌ (35), మహ్ముదుల్లా (25) రాణించారు. వాన్‌ మీకెరెన్‌, ఆర్యన్‌ దత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసి ఓడింది. ఏంజెల్‌బ్రెట్‌ (33), విక్రమ్‌జిత్‌ (26), ఎడ్వర్డ్స్‌ (25) ఫర్వాలేదనిపించారు. టస్కిన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షకీబ్‌ నిలిచాడు.
 
ఆ తర్వాత 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు ఆరంభంలో ఆ జట్టు ఆటగాళ్ళ ఆటతీరు బాగానే ఉన్నప్పటికీ చివరి ఆరు ఓవర్లలో తడబాటు దెబ్బతీసింది. పవర్‌ ప్లేలో ఓపెనర్లు లెవిట్‌ (18), ఓడౌడ్‌ (12) వికెట్లను కోల్పోగా, విక్రమ్‌జిత్‌ ఉన్నకాసేపు వేగం చూపుతూ మూడు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. ఏంజెల్‌బ్రెట్‌తో తను మూడో వికెట్‌కు 37 పరుగులు అందించాడు. ఆ తర్వాత కెప్టెన్‌ ఎడ్వర్డ్స్‌, ఏంజెల్‌ బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కోవడంతో జట్టు విజయం వైపు వెళ్తున్నట్టనిపించింది. 14వ ఓవర్‌ వరకు సజావుగా సాగిన డచ్‌ ఛేజింగ్‌ ఆ తర్వాత పూర్తిగా తడబడింది. 15వ ఓవర్‌లో ఏంజెల్‌బ్రెట్‌, బాస్‌ డి లీడ్‌ (0)లను రిషాద్‌ అవుట్‌ చేయడంతో మరిక కోలుకోలేకపోయింది. దీంతో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూయార్క్‌లో మస్తు మజా చేస్తున్న అనుష్క శర్మ