Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 21 March 2025
webdunia

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : నేడు చిరకాల ప్రత్యర్థుల పోరు.. భారత్ వర్సెస్ పాకిస్థాన్!!

Advertiesment
ind vs pak

వరుణ్

, ఆదివారం, 9 జూన్ 2024 (10:21 IST)
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు ఆదివారం జరుగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు న్యూయార్క్‌ స్టేడియం వేదికకానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియాకు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరుజట్లు ఏడుసార్లు తలపడగా, ఆరు సార్లు టీమిండియా విజయం సాధించింది. ఒక్కసారి మాత్రమే పాకిస్థాన్ విజయాన్ని అందుకుంది. మరోవైపు ఈ వరల్డ్ కప్‌లో ఐర్లాండ్‌పై ఘన విజయంతో భారత్ మంచి జోరుమీదుంటే.. ఆతిథ్య అమెరికా చేతిలో అనూహ్య పరాజయంతో దాయాది జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇక ఐసీసీ మెగాటోర్నీలో కీలక మ్యాచ్‌గా భావిస్తున్న భారత్, పాక్ పోరులో పైచేయి ఎవరిదో మరికొన్ని గంటల్లో తేలనుంది.
 
యుద్ధాన్ని తలపించే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు దేశాల అభిమానులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. మెగాటోర్నీ కోసం న్యూయార్క్‌లో కొత్తగా నిర్మించిన నసావు కౌంటీ స్టేడియంలో ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య కీలక పోరు జరుగనుంది. 34 వేల మంది సామర్థ్యం కలిగిన నసావు స్టేడియం దాయాదుల మ్యాచ్‌కు కిక్కిరిసిపోయే అవకాశముంది.
 
ఇదిలావుంటే, 2024 టీ20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు జోరుమీద కనిపిస్తుంది. ఐర్లాండ్ తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన రోహిత్ సేన అదే దూకుడును ప్రదర్శించాలని చూస్తోంది. అటు నిలకడలేమికి చిరునామా అయిన పాకిస్థాన్‌కు చెక్ పెట్టేందుకు టీమిండియా అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ఐర్లాండ్ ఆడిన జట్టునే పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు దాదాపు కొనసాగించే అవకాశముంది. 
 
ఇకపోతే, నసావు కౌంటీ స్టేడియంలో డ్రాప్ ఇన్ పిచ్‌‍పై ఐసీసీ ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై అటు ప్లేయర్లతో పాటు మాజీలు తమదైనశైలిలో విమర్శిస్తున్నారు. ఐర్లాండ్ మ్యాచ్‌లో రోహిత్, పంత్‌కు గాయాలు కాగా, పాక్ పోరులో పిచ్ ఎలా స్పందిస్తుందనేది అంచనాలకు అందకుండా ఉంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో న్యూయార్క్ పిచ్ అందరినీ అందోళనకు గురిచేస్తుంది. ఇక ఈ పిచ్‌పై జరిగిన తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాపై శ్రీలంక 77 పరుగులకే ఆలౌట్ అయింది. పిచ్ సమాంతరంగా లేకపోవటంతో బాల్ రకరకాలుగా బౌన్స్ అవుతోంది. దీంతో రెండు జట్లు భయపడుతున్నాయి.
 
ఇరు జట్ల అంచనా.. 
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ /కుల్దీప్ యాదవ్, జస్రీత్ బుమ్రా, అర్షిదీప్ సింగ్, మహ్మద్
 
పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజమ్(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఉస్మాన్, ఫకర్ జమాన్, ఆజమ్, ఇప్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ / ఆయూబ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, ఆమిర్, హరీస్ రవూఫ్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌తో టి20 ప్రపంచకప్ మ్యాచ్‌- ఇమాద్ వసీమ్ డౌటేనా?