Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : మూడు అరుదైన రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ

Advertiesment
rohit sharma

వరుణ్

, గురువారం, 6 జూన్ 2024 (13:41 IST)
అమెరికా, వెస్టిండీస్‌లు ఆతిథ్యమిచ్చే ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ టోర్నీలో భాగంగా, భారత్ తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టుతో తలపడింది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడు ఓరుదైన రికార్డులను తన పేరుపై లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. అలాగే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఇకపోతే, బుధవారం ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ హిట్ మ్యాన్ 37 బంతుల్లోనే 52 పరుగులు చేసి భారత జట్టుకు తొలి విజయం అందించిన విషయం తెలిసిందే. అతని ఇన్నింగ్స్ 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 
 
కాగా, టీ20 ప్రపంచకప్‌లో నాలుగు వేల పరుగులు సాధించాడు. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లి, బాబర్ ఆజామ్‌లు ఉన్నారు. అయితే, బుధవారం నాటి మ్యాచ్‌లో చేసిన పరుగులతే రోహిత్ మొత్తం పరుగులు 4,038కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ జాబితాలో విరాట్ కోహ్లి అగ్రస్థానంలో ఉంటే.. 4,025 పరుగులతో రోహిత్ రెండో స్థానంలో, 4,023 పరుగులతో బాబర్ మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే తక్కువ బంతుల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగానూ రోహిత్ రికార్డులకెక్కాడు. ఇక ఈ పొట్టి ఫార్మాట్‌లో హిట్ మ్యాన్ 5 శతకాలు, 30 అర్థశతకాలు బాదాడు.
 
అలాగే, టీ20 ప్రపంచ కప్‌లో 1,000 పరుగులు పూర్తి చేసిన ముగ్గురు ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. విరాట్ కోహ్లి (1142 పరుగులు), మహేళ జయవర్ధనే (1016 పరుగులు) ఈ ఘనత సాధించారు. ఓవరాల్ ప్రారంభ ఎడిషన్ నుండి టీ20 ప్రపంచ కప్‌ ఆడుతున్న హిట్ మ్యాన్ 36.25 సగటుతో 1,015 పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
 
అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డును రోహిత్ శర్మ నమోదు చేశాడు. తనదైనశైలిలో సిక్సర్లు కొట్టి 'హిట్ మ్యాన్'గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ టెస్టుల్లో 84 సిక్సర్లు, వన్డేలలో 323 సిక్సర్లు, టీ20ల్లో 193 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లో 553 సిక్సర్లతో రోహిత్ తర్వాతి స్థానంలో విండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ ఉన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నార్వే చెస్ టోర్నీలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ప్రజ్ఞానంద