Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ టీ20 వరల్డ్ : సౌతాఫ్రికా ఆశలను గల్లంతు చేసిన నేపాల్!!

south africa team

వరుణ్

, శనివారం, 15 జూన్ 2024 (10:48 IST)
సంచలనాకు కేంద్ర బిందువైన టీ20 క్రికెట్‌లో శుక్రవారం మరో ఆసక్తికరమైన, ఉత్కంఠ భరిత మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఆశలను కేవలం ఒక్క పరుగు తేడాతో క్రికెట్ పసికూన నేపాల జట్టు గల్లంతు చేసింది. ఈ రెండు జట్ల మధ్య అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో సఫారీ జట్టు విజయం సాధించింది. దీంతో ముక్కలైన హృదయంతో నేపాల్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 115 పరుగులు సాధించింది. స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన నేపాల్‌ ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించింది. 8వ ఓవర్‌లో సఫారీ బౌలర్‌ షంసీ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి ఆ జట్టును దెబ్బకొట్టాడు. ఆ తర్వాత నేపాల్‌ పటిష్టస్థితిలోనే ఉండి విజయానికి చేరువైనట్లే కన్పించింది. అప్పుడు మళ్లీ బంతి అందుకున్న షంసీ.. 18వ ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.
 
చివరి ఓవర్‌లో 8 పరుగులు అవసరం కాగా మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. తీవ్ర ఒత్తిడిలోనూ దక్షిణాఫ్రికా బౌలర్‌ బార్ట్‌మన్‌ నేపాల్‌ బ్యాటర్లను కట్టడి చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. గుల్సాన్‌ ఝాను ఔట్‌ చేశాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ గెలిస్తే సూపర్‌-8 రేసులో నిలబడేది. ఓటమి పాలవడంతో టోర్నీ నుంచి తిరుగుముఖం పట్టింది. సఫారీ బౌలర్‌ షంసీ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్వంటీ-20 వరల్డ్ కప్‌లో దాయాది దేశానికి చెత్త రికార్డ్