Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్వంటీ-20 వరల్డ్ కప్‌లో దాయాది దేశానికి చెత్త రికార్డ్

pakistan team

సెల్వి

, శనివారం, 15 జూన్ 2024 (09:09 IST)
ట్వంటీ-20 వరల్డ్ కప్‌లో దాయాది దేశం నిష్క్రమించింది. సూపర్-8 దశ నుంచి జట్టు నిష్క్రమించింది. శుక్రవారం ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో అమెరికా- ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో పాక్ ఆశలపై నీళ్లు చల్లింది. 
 
యూఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. పర్యవసానంగా 5 పాయింట్లలో యూఎస్ఏ జట్టు సూపర్-8 దశకు అర్హత సాధించింది. 
 
జూన్ 16న ఐర్లాండ్‌తో పాకిస్థాన్ తన చిట్టచివరి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది. కాగా ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో యూఎస్ఏ-ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. సూపర్-8 దశలో టీమిండియా గ్రూప్-1లో ఉంటుంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌లతో పాటు బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్‌‌ జట్లలో ఒక దానితో తలపడాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీ20 వరల్డ్ కప్ : పాకిస్థాన్ ఆశలు గల్లంతేనా? ఆతిథ్య జట్టు ఓడిపోవాలని ప్రార్థనలు!