Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దక్షిణాఫ్రికాలో 35ఏళ్ల వ్యక్తికి మంకీఫాక్స్.. అప్రమత్తంగా వుండాలి

Monkey pox

సెల్వి

, మంగళవారం, 14 మే 2024 (13:39 IST)
Mpox అని కూడా పిలువబడే మంకీపాక్స్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి జో ఫాహ్లా కోరారు. గౌటెంగ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న 35 ఏళ్ల వ్యక్తికి మే 9, 2024న నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని ఫహ్లా నేతృత్వంలోని జాతీయ ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది.
 
ఆ దేశంలోని ప్రముఖ పాథాలజీ లేబొరేటరీలలో ఒకటైన లాన్సెట్ లాబొరేటరీ ఈ కేసును మొదట పరీక్షించింది. ఆపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) ద్వారా నిర్ధారించబడింది. ఇది డిపార్ట్‌మెంట్‌ను అప్రమత్తం చేసింది.
 
ఇంకా మంకీపాక్స్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందాలని తాము ప్రజలను కోరుతున్నాము" అని ఆరోగ్య శాఖ ప్రతినిధి ఫోస్టర్ మోహలే జిన్హువా వార్తా సంస్థతో అన్నారు. మంకీపాక్స్ వైరస్ (MPXV) వల్ల మానవులలో వచ్చే అరుదైన వైరల్ అంటు వ్యాధి. దీని కారణంగా బాధాకరమైన దద్దుర్లు, జ్వరం, సాధారణ ఫ్లూ-వంటి లక్షణాలను ఈ వ్యాధి కలిగివుంటుంది.   చర్మంపై పొక్కు లాంటి దద్దుర్లు ఏర్పడతాయని కూడా ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2022 ఆగస్టులో మంకీపాక్స్ కేసు నమోదైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ముగిసిన పోలింగ్.. హైదరాబాద్‌కు క్యూకట్టిన ఓటర్లు