Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సొంత స్టేడియంలో చెన్నైకు భంగపాటు ... పంజాబ్ సునాయాస విజయం

pkbs vs csk

ఠాగూర్

, గురువారం, 2 మే 2024 (10:49 IST)
ఐపీఎల్ 2024 సీజన్ పోటీల్లో భాగంగా, చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు భంగపాటు ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు సీఎస్కే జట్టుపై సునాయాస విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. పీబీకేఎస్ బ్యాటర్లలో బెయిర్ స్టో (46), రోస్సో (43) రాణించారు. కెప్టెన్ శామ్ కరన్ 26, శశాంక్ సింగ్ 25 చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రిచర్డ్, శివం దూబే చెరో వికెట్ పడగొట్టారు. 
 
తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో మరోసారి రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ (62)తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆదాడు. మరో ఓపెనర్ అజింక్య రహానే 29, సమీర్ రిజ్వీ 21 పరుగులు చేయగా, మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. టీ20 వరల్డ్‌ కప్‌కు ఎంపికైన శివం దూబే ఈ మ్యాచ్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఎప్పటిలానే చివర్లో బ్యాటింగ్‌కి వచ్చిన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ (14) కూడా మెరుపులు మెరిపించలేకపోవడంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. పంజాబ్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలో రెండు వికెట్లు.. అర్షదీప్ సింగ్, వికెట్ తీశారు. ఆ తర్వాత 163 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ అలవోకగా లక్ష్యాన్ని చేరుకుంది. 
 
కాగా, ఈ విజయంతో సీఎస్‌కేపై పీబీఎస్‌కే అరుదైన రికార్డు నమోదు చేసింది. ఆ జట్టును వరుసగా ఐదు సార్లు ఓడించింది. దీంతో ముంబై ఇండియన్స్ తర్వాత ఈ ఫీట్ సాధించిన జట్టుగా నిలిచింది. అలాగే చెపాక్ మైదానంలో చెన్నైపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ముంబై తర్వాతి స్థానంలో పంజాబ్ నిలిచింది. ఎంఐ ఐదు సార్లు చెపాక్‌లో సీఎస్‌కేపై విక్టరీ నమోదు చేయగా, పంజాబ్ నాలుగు సార్లు గెలిచింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీ20 జట్టులో రాహుల్‍‌కు మొండిచేయి.. బాలీవుడ్ నటుడు మద్దతు!!