Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2024 : ఆర్సీబీపై సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ

Advertiesment
rcb vs srh

వరుణ్

, శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (09:31 IST)
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించింది. 
 
హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ గెలుపులో విరాట్ కోహ్లి, యువ బ్యాటర్ రజత్ పాటిదార్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ అర్థ సెంచరీలు బాది హైదరాబాద్ 206 పరుగుల టార్గెట్ నిర్దేశించడంలో సాయపడ్డారు. ఈ క్రమంలో వీరిద్దరూ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు.
 
19 బంతుల్లోనే అర్థసెంచరీ బాదిన రజత్ పటీదార్.. ఆర్సీబీ తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన మూడవ ఆటగాడిగా నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున గత 11 ఏళ్లలో 20 లోపు బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేసిన ఆటగాడు రజత్ పటీదారే కావడం గమనార్హం. ఐపీఎల్ 2013 ఎడిషన్లో పుణె వారియర్స్పై క్రిస్ గేల్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత బెంగళూరు ఆటగాళ్లలో ఎవరూ 20 లోపు బంతుల్లో అర్థ సెంచరీ చేయలేదు.
 
ఆర్సీబీకి వేగవంతమైన అర్థశతకాలు 1. క్రిస్ గేల్ - 17 బంతులు (2013) 
2. రాబిన్ ఉతప్ప - 19 బంతులు (2010) 
3. రజత్ పాటిదార్ -19 బంతులు - (2024) 
4. ఏబీ డివిలియర్స్ - 21 బంతులు (2012) 
5. రజత్ పాటిదార్ - 21 బంతులు (2024) 
 
మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 51 పరుగులు బాదడంతో ప్రస్తుత సీజన్‌లో కోహ్లీ పరుగులు 400 దాటాయి. ఈ మార్క్ చేరుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు ఐపీఎల్ 10 వేర్వేరు ఎడిషన్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తను కొట్టిన సిక్సర్ కారణంగా గాయపడిన కెమెరామెన్... సారీ చెప్పిన పంత్!