Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనం... కివీస్ బౌలర్ సరికొత్త రికార్డు!!

వరుణ్
మంగళవారం, 18 జూన్ 2024 (11:58 IST)
క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనం చోటుచేసుకుంది. న్యూజిలాండ్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కేవలం నాలుగు ఓవర్లు వేసిన ఫెర్గూసన్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు కదా ఏకంగా మూడు వికెట్లు నెలకూల్చాడు. అంటే నాలుగు ఓవర్లు, నాలుగు మెయిడిన్ ఓవర్లు.. మూడు వికెట్లు. ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు ఇవే కావడం గమనార్హం. 
 
అలాగే టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇలా 4 ఓవర్లు మెయిడిన్ వేసిన తొలి బౌలర్‌గా కూడా ఫెర్గూసన్ సన్న్ నిలిచాడు. పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ ఈ నయా రికార్డు అందుకున్నాడు. గతంలో కెనడాకు చెందిన సాద్ బిన్ జఫర్ కూడా 4 మెయిడిన్ ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. ఇపుడు ఈ రికార్డు తుడిచిపెట్టుకునిపోయింది. 
 
మరోవైపు, పాపువా న్యూ గినియాతో జరిగిన ఈ మ్యాచులో కివీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పీఎన్‌జీని ఫెర్గూసన్ ఘోరంగా దెబ్బతీశాడు. దీంతో ఆ జట్టు 78 పరుగులకే కుప్పకూలింది. 
 
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇక ఇప్పటికే ఈ రెండు జట్లు టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో గ్రూప్-సీలో న్యూజిలాండ్ మూడో స్థానంతో తన ప్రస్థానాన్ని ముగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

తర్వాతి కథనం
Show comments