Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీ రికార్డును బద్ధలుకొట్టిన పాక్ కెప్టెన్ బాబర్!!

baabar aazam

వరుణ్

, సోమవారం, 17 జూన్ 2024 (14:02 IST)
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం బద్ధలు కొట్టారు. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. అయితే, ఈ టోర్నీలో పాకిస్థాన్ జట్టు నాకౌట్‌ దశకు చేరుకుండానే నిష్క్రమించింది. కేవలం ఒక మ్యాచ్‌లో పాక్ జట్టు గెలుపొందింది. ఆదివారం క్రికెట్ పసికూన ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు మూడు వికెట్ల తేడాతో గెలిచింది. 
 
ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని పాక్ 7 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. టార్గెట్ ఛేజింగ్ ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ కీలక పాత్ర పోషించాడు. చివరి వరకు క్రీజులో ఉన్న బాబర్ ఆజమ్ 34 బంతుల్లో 32 పరుగులు చేశారు. ఒక పక్క వికెట్లు పడుతున్నా తను మాత్రం చక్కగా ఆడి పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో భారత మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ రికార్డును బాబర్ ఆజం బద్దలు కొట్టాడు.
 
టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు. ఐర్లాండ్‌పై 32 పరుగులతో టీ20 వరల్డ్ కప్‌లో బాబర్ 17 మ్యాచ్ మొత్తం పరుగులు 549కి పెరిగాయి. ఇక 29 మ్యాచ్‌లు ఆడి 529 పరుగులు చేసి ఇంతకాలం తొలి స్థానంలో ఉన్న ధోనీని అతడు అధిగమించాడు. న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ మొత్తం 19 మ్యాచ్‌లు ఆడి 527 పరుగులు సాధించి ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. 
 
టీ20 వరల్డ్ కప్లలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు వీళ్లే... 
1. బాబర్ ఆజం - 549 (17 మ్యాచ్‌లు) 
2. ఎంఎస్ ధోనీ - 529 (29 మ్యాచ్‌లు) 
3. కేన్ విలియమ్సన్ - 527 (19 మ్యాచ్‌లు) 
4. మహేల జయవర్ధనే - 360 (11 మ్యాచ్‌లు) 
5. గ్రేమ్ స్మిత్ - 352 (16 మ్యాచ్‌లు) 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : సూపర్-8కు ఐర్లాండ్ - టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్!!