Webdunia - Bharat's app for daily news and videos

Install App

14-09-2023 గురువారం రాశిఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం...

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| నిజ శ్రావణ బ॥ అమావాస్య పూర్తి పుబ్బ తె.5.09 ఉ.వ.11.27 ల 1.13. ఉ. దు. 9.55ల 10.44 ప. దు. 2.50ల 3.39.
 
రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం, జయం, పురోభివృద్ధి కానవస్తుంది.
 
మేషం :- దంపతుల మధ్య అభిప్రాయభేదాలు గృహ ప్రశాంతతకు భంగం కలిగే పరిస్థితులు నెలకొంటాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచితుల పట్ల మెళకువ అవసరం. ప్రైవేటు సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు క్రీడా రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం :- స్త్రీలు ఓర్పు, నేర్పుతో వ్యవహరించటం ఎంతైనా అవసరం. ఋణప్రయత్నం ఫలిస్తుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమ, విశ్రాంతి లోపం వంటి చికాకు ఆందోళనలను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
మిథునం :- నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుతాయి. అపరిచితులతో మితంగా సంభాషించటం క్షేమదాయకంగా ఉంటుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనం నపుడునపుడు మెళకువ అవసరం.
 
కర్కాటకం :- ఉద్యోగస్తుల తొందరపాటు తనానికి అధికారులతో మాటపడక తప్పదు. మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. సందర్భానుకూలంగా సంభాషించుటం వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది. సేవా, పుణ్య కార్యాలలో మీ శ్రమకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. విదేశీ యత్నాలు ఫలిస్తాయి.
 
సింహం :- స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. విదేశాలు వెళ్ళటానికి చేయుయత్నాలు ఫలిస్తాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
కన్య :- నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. ధనవ్యయం, చెల్లింపుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ప్రముఖులను కలుసుకుంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది.
 
తుల :- ఏదైనా అమ్మకానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. విందులలో పరిమితి పాటించండి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. స్త్రీలు ఆడంబరాలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దల ఆరోగ్యములో మెళకువ అవసరం. రాజకీయనాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం :- కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో ఏకాగ్రత వహించండి. కాంట్రక్టర్లకు నూతన టెండర్లు చేతికందుతాయి. బంధు మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. స్థిర, చరాస్తులు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. ప్రముఖులు ఆలయాలను సందర్శిస్తారు.
 
ధనస్సు :- మీ కళత్ర మొండివైఖరి మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రచయితలకు, పత్రికా, ప్రైవేటు సంస్థల్లో వారికి ఆశించినంత పురోభివృద్ధి కావస్తుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పనులు వాయిదా పడుటవల్ల ఆందోళన చెందుతారు.
 
మకరం :- తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలకు గురికాకండి. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషి చేస్తారు. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు.
 
కుంభం :– బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పట్టు విడుపు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని పనులు మీకు సానుకూలమవుతాయి. విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమసమాచారాలు ఊరట కలిగిస్తాయి. స్థిరాస్తి అమ్మకం వాయిదా వేయటం మంచిది. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.
 
మీనం :- పండ్లు, పూలు, కొబ్బరి వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. పెద్దలతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. బృందకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. సహచరుల సలహా వల్ల నిరుద్యోగులు సదావకాశాలు జారవిడుచుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు.. మే 15 నుండి మే 26 వరకు 12 రోజుల పాటు...

తూచ్.. అదంతా ఫేక్ : రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన అయోధ్య రామిరెడ్డి (Video)

సూర్యాపేటలో పరువు హత్య.. కులాంతర వివాహం చేసుకున్నాడని కొట్టి చంపారు..

పరాయి మహిళ మోజులోనే గురుమూర్తి ఘాతుకం!

Amazon: అమేజాన్ విధానాలపై పవన్ అసంతృప్తి.. గిఫ్ట్ కార్డుల నుండి డబ్బు.. ఇంత కష్టమా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Abhijit Muhurat: అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి? మధ్యాహ్నం పూట ఇవి చేస్తే?

Shattila Ekadashi 2025: శనివారం షట్తిల ఏకాదశి- పేదలకు అవి చేస్తే.. బంకమట్టి కూడా?

25-01-2025 శనివారం దినఫలితాలు : వాహనం ఇతరులకివ్వవద్దు...

24-01-2025 శుక్రవారం దినఫలితాలు : అనుభవజ్ఞుల సలహా తీసుకోండి...

23-01-2025 గురువారం దినఫలితాలు : దంపతుల మధ్య సఖ్యత...

తర్వాతి కథనం
Show comments