Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

10-09-2023 - ఆదివారం ఆదిత్య హృదయం చదివినా..?

Pisces
, ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (05:00 IST)
ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం:- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి.
 
వృషభం :- ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. మానసిక ప్రశాంతతకు పుస్తక పఠనం, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించండి.
 
మిధునం:- రాజకీయాలలో వారికి పార్టీపరంగాను, అన్ని విధాలా కలిసివస్తుంది. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.
 
కర్కాటకం:- నిత్యావసర వస్తు, స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థులు క్రీడా రంగాలపట్ల ఆసక్తి చూపుతారు. ఒకానొక వ్యవహరంలో మీ ప్రమేయం మంచి ఫలితాలనిస్తుంది. ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికమవుతుంది. ప్రేమికులు ఎడబాటు, ఆటంకాలు ఎదుర్కొనక తప్పదు.
 
సింహం:- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విందులు, విలాసాలలో మితంగా వ్యవహరించండి.
 
కన్య:- స్త్రీలు ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చటం వల్ల మాటపడక తప్పదు. రచయితలకు, పత్రికా, ప్రైవేటు సంస్థల్లో వారికి ఆశించినంత పురోభివృద్ధి కానవస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తి కావు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. ప్రముఖుల కలయిక సాధ్యపడుతుంది.
 
తుల:- ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు కృషిఫలిస్తుంది. మీ ఏమరపాటుతనం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత, సునిశిత పరిశీలన ప్రధానం.
 
వృశ్చికం:- సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. దుబారా ఖర్చులు అధికం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ధన వ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెలకువ వహించండి. రాజకీయాల్లో వారికి తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. పాత శత్రువులు మిత్రులుగా మారతారు.
 
ధనస్సు:- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన సమసిపోగలవు. ఎప్పటినుండో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్లమెళుకువ అవసరం. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. కార్యదీక్షతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
 
మకరం:- సాంఘిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. రాజకీయ నాయకులు ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే మంచిది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
 
కుంభం:- స్త్రీలకు బంధువులరాక వల్ల పనిలో ఆటంకాలు తలెత్తుతాయి. బంధు మిత్రుల మధ్యరహస్యాలు దాచడం వల్ల విభేదాలు తలెత్తవచ్చు. ట్రాన్స్పోర్టు, ట్రావెలింగ్ ఏజెంట్లకు సదవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. నిరుద్యోగులు రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు.
 
మీనం:- రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత చాలా అవసరం. రోజులు, భారంగాను, విసుగ్గాను సాగుతాయి. రాజకీయ నాయకులుసభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. ఒక ఖర్చు నిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-09-2023 నుంచి 16-09-2023 వరకు మీ వార రాశిఫలితాలు