Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

10-09-2023 నుంచి 16-09-2023 వరకు మీ వార రాశిఫలితాలు

Astrology
, శనివారం, 9 సెప్టెంబరు 2023 (15:49 IST)
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. మాటతీరు ఆకట్టుకుంటుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గురువారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఎవరినీ సాయం అడుగవద్దు. అపరిచితులు మోసగించే ఆస్కారం ఉంది. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. గృహం సందడిగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఆశించిన ఫలితమీయవు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగాలి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. శనివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిన్న వ్యాపారాలు బాగుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
సంప్రదింపులకు అనుకూలం. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాలు కలిసిరావు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. సోమ, మంగళ వారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సంతానం యత్నాలు ఫలిస్తాయి. అవివాహితులకు శుభసూచకం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురువుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఎరువుల వ్యాపారులకు కష్టసమయం. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
వ్యవహార జయం, కార్యసిద్ధి ఉన్నాయి. అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు సానుకూలమవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. బుధవారం నాడు అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. విదేశాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ప్రతికూలతలను దీటుగా ఎదుర్కుంటారు. ఆప్తుల హితవు మీపై సత్ప్ర్పభావం చూపుతుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటువుతుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆత్మీయులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. గురువారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. గృహమార్పు అనివార్యం. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలసివస్తాయి. ప్రైవేట్ రంగ సంస్థలకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవ, దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఆలోచనలతో సతమతమవుతారు. మనస్థిమితం ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆప్తుల కలయిక వీలుపడదు. అవకాశాలు చేజారిపోతాయి పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆత్మస్థైర్యంతో మెలగండి. శుక్రవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలెదవురవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అన్ని రంగాల వారికీ శుభదాయకమే. ఉల్లాసంగా గడుపుతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. గురు, శుక్ర వారాల్లో పనులు అనుకున్న విధంగా సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొత్త వ్యాపారాలకు సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు పురస్కార యోగం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. పత్రాలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు సద్దుమణుగుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అనుకున్నది సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. శనివారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. స్ధిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య అరమరికలు తగవు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తి ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికుల ఆదాయం బాగుంటుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ప్రతికూలతలు అధికం. మీ సమర్ధతపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఈ ఇబ్బందులు తాత్కాలికేమే. ఆశావహదృక్పథంతో ముందుకు సాగండి. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. సోమ, మంగళ వారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలీయవు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండీఇ. పెట్టుబడులకు తరుణం కాదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. బుధవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణం తలపెడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ఈ వారం ఏమంత అనుకూలం కాదు. లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. సహాయం, సలహాలు ఆశించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఖర్చులు అధికం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. సంతానం కృషి ఫలిస్తుంది. ట్రాన్స్పోర్టు రంగాల వారికి సమస్యలెదురవుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-09-2023 శనివారం దినఫలాలు - శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించినా సర్వదా శుభం