శ్రీ శోభకృత్ నామ సం|| నిజ శ్రావణ ఐ|| ద్వాదశి రా.12.05 పుష్యమి రా.9.31 వర్ణ్యం లేదు. ప.దు. 12.24 ల 1.13 పు. దు. 2. 52 ల 3.41.
ఉమాపతిని ఆరాధించిన శుభం, జయం చేకూరుతుంది.
మేషం :- వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. యోగా, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల బాటలోనడుస్తాయి.
వృషభం :- విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రదేశానికి వెళ్ళవలసివస్తుంది. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. ప్రతిఫలం తక్కువైనా వృత్తుల వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది.
మిథునం :- చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. ముఖ్యులతో కలసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. రేపటి గురించి ఆలోచనలు అధికమవుతాయి. దైవకార్యాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు.
కర్కాటకం :- రాజకీయ నాయకులుకు ప్రయాణాలలో మెళుకువ అసవరం. కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోటులు తప్పవు. నూతన పరిచయాలేర్పడతాయి.
సింహం :- ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచన లుంటాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం ఆశించినంతగా ఉండదు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచనకొంత కాలం వాయిదావేయటంమంచిది.
కన్య :- ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవటం మంచిది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కళాకారులకు అభివృద్ధి చేకూరుతుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ముఖ్యమైన విషయాలు గోప్యంగాఉంచండి.
తుల :- కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ఆలస్యంగా అందుతుంది. ముఖ్యులలో ఒకరి వైఖరి మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయు ప్రయత్నాలలో సఫలీకృతులౌతారు. మిత్రుల ప్రోత్సాహంతో నిరుద్యోగులు ఉపాథి పథకాలు చేపడతారు. మీ సంతానం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయిజాగ్రత్త వహించండి.
వృశ్చికం :- ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. నిరుద్యోగులకు ఏకాగ్రత అవసరం. వాహనచోదకులకు ఆటంకాలు తప్పవు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. విపరీతమైన ఖర్చులు, శ్రమాధిక్యత వల్ల మనస్సు నిలకడగా ఉండదు. మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి ఉంటుంది.
ధనస్సు :- సహకార సంస్థల్లో వారికి, ప్రైవేటు, మార్కెటింగ్ రంగాల్లో శ్రమాధిక్యత కానవస్తుంది. విదార్థుల ఆలోచనలు ప్రక్కదారి పట్టవచ్చు. పారిశ్రామిక రంగంలోని వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
మకరం :- విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలించక పోవటంతో ఆందోళనకు గురిఅవుతారు. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలకు ధనం బాగా వెచ్చిస్తారు. వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
కుంభం :- దంపతుల మధ్య కలహాలు, ప్రశాంతత వంటి చికాకులను ఎదుర్కుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. మీ అగ్రహావేశాల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం.
మీనం :- మీ కుటుంబీకులు మీ మాటా, తీరును వ్యతిరేకిస్తారు. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయటం మంచిది. పాత పరిచయస్తులు, ఆప్తులను కలుసుకుంటారు. మార్కెటింగ్ రంగాల వారికి, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. బంధువులకు పెద్దమొత్తం ఇచ్చే విషయలో పునరాలోచన అవసరం.