Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఆళ్వార్ తిరుమంజన సేవ..

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (16:08 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆళ్వార్ తిరుమంజన సేవను నిర్వహించారు. దీని కోసం 6 గంటల పాటు భక్తులకు దర్శనం నిలిపివేయడం జరిగింది. తిరుమలలో ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఆలయాన్ని శుద్ధిచేసే ఆళ్వార్ తిరుమంజన సేవ జరిగింది. 
 
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సంవత్సరానికి నాలుగు సార్లు ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆచారం. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి పండుగలను పురస్కరించుకుని ఈ సేవను నిర్వహిస్తాం. ఈసారి బ్రహ్మోత్సవాల కోసం మంగళవారం ఆలయ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించామన్నారు. 
 
మంగళవారం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఆలయ శుభ్రత కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు, ఆలయం మొత్తం ఈ సేవ జరిగింది. ఆళ్వార్ తిరుమంజన సేవకు అనంతరం స్వామి వారికి అభిషేక, అలంకరలు జరిగాయి. ఆపై భక్తులకు శ్రీవారి దర్శనం కలుగ జేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉదయం మూడు ముళ్లు వేయించుకుంది.. రాత్రికి ప్రాణాలు తీసుకుంది.... నవ వధువు సూసైడ్

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే- జర్నీకి రెండు గంటలే

వరకట్న వేధింపులు... పెళ్లయిన 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య

Galla Jaydev: దేవుడు దయ ఉంటే తిరిగి టీడీపీలో చేరుతాను: జయదేవ్ గల్లా

ఎర్రకోట వద్ద భద్రతా వైఫల్యం.. డమ్మీ బాంబును గుర్తించిన భద్రతా సిబ్బంది

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments