ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో మరో చిరును తితిదే అధికారులు పట్టుకున్నారు. అలిపిరి - తిరుమల నడక మార్గంలో నరసింహ స్వామి ఆలయం ఏడో మైలు ప్రాంతంలో ఈ చిరుత బోనులో చిక్కినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో గత రెండు నెలల కాలంలో ఈ మార్గంలో పట్టుబడిన చిరుతల సంఖ్య ఐదుకు చేరిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
నాలుగు రోజుల క్రితమే ఈ చిరుత కెమెరా కంట పడింది. అప్పటినుంచి అధికారులు దాన్ని బంధించేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల అలిపిరి నడకమార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక మృతిచెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల గిరుల్లో పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల అలిపిరి మెట్ల మార్గంలో ఓ చిరుత చేసిన దాడిలో నెల్లూరుకు చెందిన శ్రీలక్ష్మి అనే బాలిక ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత మెట్ల మార్గంలో భక్తలు రాకపోకలపై అనేక రకాలైన ఆంక్షలు విధించారు. తాజాగా నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు రక్షణగా చేతి కర్రలను కూడా అందజేస్తున్నారు.