చిరుత క్రూర జంతువు. చిరుతపులులులను చూస్తే పారిపోతారు. అటువంటిది ఓ చిరుతపైకి ఎక్కి చల్ చల్ అంటూ ఆడుకున్నారు కొందరు యువకులు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇక్లేరా గ్రామానికి సమీపంలో అటవీప్రాంతం వుంది. ఆ ప్రాంతంలో కొందరికి చిరుతపులి కనిపించింది. దాన్ని చూసి తొలుత అంతా జడుసుకున్నారు.
కానీ అది కదలక మెదలక నీరసంగా అక్కడే వుంది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని అంతా కలిసి దానివద్దకు వెళ్లారు. ఆ పులి అనారోగ్యంతో వున్నట్లు గుర్తించారు. అది తెలిసి ఇక ఆ చిరుతతో ఆడుకున్నారు. ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువు కుక్కలా దాన్ని పట్టుకుని అటూఇటూ తిప్పారు. ఓ వ్యక్తి అయితే చిరుతపై కూర్చుని చల్ చల్ అంటూ సెల్ఫీ తీసుకున్నాడు.
చిరుత గురించి ఓ వ్యక్తి అటవీశాఖకి సమాచారం అందించడంతో వారు దాన్ని చికిత్స కోసం రాష్ట్ర రాజధాని భోపాల్కి తరలించారు. ఐతే చిరుత ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుందని వారు చెప్పారు.