సోషల్ మీడియాలో వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో కొన్ని చాలా అందంగా ఉంటే, కొన్ని చాలా ఫన్నీగా ఉన్నాయి. తాజాగా ఈ వీడియోను చూసినవారంతా నవ్వుకోవడం ఖాయం. వైరల్ అవుతున్న వీడియోలో, శునకం గేదెపై స్వారీ చేస్తూ కనిపిస్తుంది.
శునకం చాలా దూరం గేదెపై హాయిగా నిల్చుని స్వారీ చేస్తోంది. వీడియో మొదటి నుండి, చివరి వరకు, శునకం గేదెపై నిలబడి కనిపిస్తుంది. రెండు గేదెలు కలిసి వెళ్లడం కనిపించింది. అందులో ఒక గేదెపై శునకం నిలబడి ఉంది. ఈ వీడియోపై వినియోగదారులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ వీడియోని ప్రజలు విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 90 లక్షల మంది వీక్షించగా, 6 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై జనాలు ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు.