Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుక్క కరిచిన ఆరు నెలలకు ర్యాబీస్ - బాలుడి మృతి

Black Dogs
, సోమవారం, 24 జులై 2023 (08:16 IST)
కాకినాడ జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుక్క కరిసిన ఆరు నెలలకు ర్యాబీస్ వ్యాధి సోకడంతో 17 యేళ్ల మైనర బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిల్లాలోని గొల్లప్రోలులో వెలుగు చూసింది. ఆరు నెలల క్రితం కుక్క కరవడంతో భయపడిన బాలుడు.. విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. దీంతో ఆ బాలుడికి మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. పైగా, నీటిని చూసి భయపడిపోయాడు. దీంతో ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
జిల్లాలోని గొల్లప్రోలు గ్రామానికి చెందిన తేలు ఓంసాయి అనే 17 యేళ్ళ బాలుడిని ఆరు నెలల క్రితం కుక్క కరిచింది. ఈ విషయాన్ని అతను ఇంట్లో చెప్పలేదు. మూడు రోజుల క్రితం అతనికి తీవ్ర జ్వరం వచ్చింది. మంచినీళ్ళు కూడా తాగలేక పోయిన బాలుడు... ఆ నీటిని చూసి భయంతో వణికిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని శనివారం కాకినాడ జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ వైద్యులు పరీక్షించి, ర్యాబీస్ వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. పైగా, వ్యాధి ముదరడతో పరిస్థితి చేజారిపోయిందని వారు తెలిపారు. కాగా, కుక్కకాటుకు గురైన రోజునే యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్‌తో పాటు టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచన చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది : పురంధేశ్వరి