Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ అమ్మాయి సీమాలా ప్రేమ కోసం భారత్‌కు వచ్చిన పోలాండ్ గర్ల్

Advertiesment
Poland Woman
, గురువారం, 20 జులై 2023 (10:12 IST)
Poland Woman
పాకిస్తానీ అమ్మాయి సీమా హైదర్ తన పబ్‌జి లవర్ కోసం సరిహద్దు దాటి వచ్చిన ఘటన మరవక ముందే.. పోలాండ్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో తన భారతీయ ప్రేమికుడితో కలిసి జీవించడానికి భారతదేశానికి వచ్చింది. వీరి ప్రేమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చిగురించిందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. 
 
హజారీబాగ్‌లోని ఖుత్రా గ్రామానికి చెందిన షాదాబ్ మాలిక్ (35)తో పోలిష్ పౌరురాలికి పరిచయం ఏర్పడింది. ఈమెరు ఆరేళ్ల కుమార్తె కూడా వుంది. ఆమె పేరు బార్బరా పోలాక్‌. వీరిద్దరూ 2021లో ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ స్నేహం ప్రేమగా మారింది.
 
పోలక్ మాలిక్‌ను గాఢంగా ప్రేమించింది. అంతేగాకుండా 2027 వరకు చెల్లుబాటు అయ్యే టూరిస్ట్ వీసాపై భారతదేశానికి వచ్చింది. దీంతో వీరికి పెళ్లి కూడా ఫిక్స్ అయ్యింది. తమ వివాహం కోసం వీరిద్దరూ హజారీబాగ్ SDM కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అంతేగాకుండా పోలక్ తన భర్త నుండి విడాకులు తీసుకుంది.
 
భారత్‌కు వచ్చిన తర్వాత పోలక్ తనను కలిసిందని, కొన్ని రోజులు హోటల్‌లో బస చేశానని షాదాబ్ చెప్పాడు. ఇంకా పోలక్ భారత్‌లో వేడి తట్టుకోలేక పోయిందని రెండు ఏసీలు అమర్చాల్సి వచ్చిందని మాలిక్ వెల్లడించాడు. ఆమె కోసం కొత్త కలర్ టీవీ కూడా తీశానని చెప్పాడు. 
 
పోలాక్ మాత్రం మాలిక్ కుటుంబానికి ఇంటి పనుల్లో సహాయం చేస్తోంది. ఆమె చేతికి గ్రౌజ్ ధరించి ఆవు పేడ చెత్తను శుభ్రం చేస్తుంది. తనకు భారతదేశం, హజారీబాగ్ అంటే చాలా ఇష్టమని, అయితే రద్దీగా ఉండే ప్రదేశాలను సందర్శించడం తనకు ఇష్టం లేదని చెప్పింది. 
 
మాలిక్ చాలా మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే.. విదేశీ యువతి మాలిక్ గ్రామానికి చేరుకుందన్న వార్త తెలియగానే హజారీబాగ్ హెడ్‌క్వార్టర్స్ డీఎస్పీ రాజీవ్ కుమార్, ఇన్‌స్పెక్టర్ అభిషేక్ కుమార్ గ్రామాన్ని సందర్శించి పోలాక్‌తో మాట్లాడారు. ఆమె తన వీసాను పోలీసు అధికారులకు చూపించి, మరికొద్ది రోజుల్లో తన దేశానికి తిరిగి వెళ్తానని వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో భారీ వర్షాలు- పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు