Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12-09-2023 మంగళవారం మీ దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం...

Capricorn
, మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| నిజ శ్రావణ బ|| త్రయోదశి రా.2.01 ఆశ్రేష రా.12.01 ఉ.వ.11.38 ల 1.24. ఉ. దు. 8.16 ల 9.06రా.దు. 10.49 ల11.35.
 
లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం నెరవేరుతుంది.
 
మేషం :- రాజకీయనాయకులు అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. ప్రముఖులతో ఇంటర్వ్యూలు అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ తొందరపాటు తనం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది.
 
వృషభం :- వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలకు చుట్టు పక్కల వారితో సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించడం మంచిది. ఖర్చులు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు.
 
మిథునం :- రచయితలకు, కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ప్రేమికుల మధ్య అపోహలు తొలగిపోగలవు. బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఒక విషయంలో అయిన వారే మిమ్ములను తప్పుపడతారు. 
 
కర్కాటకం :- సన్నిహితులలో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. రవాణా రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. స్థిర, చరాస్తుల విషయంలో ఒకనిర్ణయానికి వస్తారు.
 
సింహం :- వృత్తుల్లో వారికి సమీప వ్యక్తుల సహకారం వల్ల అభివృద్ధి కానవస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. అపరిచితవ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది.
 
కన్య :- రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. వైద్యులకు ఒత్తిడి, ఆడిటర్లకు ఆటంకాలు వంటివి అధికమవుతాయి. మీ ఉన్నతినిచూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
తుల :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. చిరకాలపు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీ మాటకు కుటుంబలోను, సంఘంలోను విలువ పెరుగుతుంది. పెద్దలతోను, ప్రముఖులతోను సంప్రదింపులలో సంతృప్తి కానరాగలదు. ముఖ్యులను కలుసుకున్నా కార్యం నెరవేరదు.
 
వృశ్చికం :- పత్రికా, మీడియా రంగాలవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు పనిభారం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. దైవా సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల చికాకులు అధికమవుతాయి.
 
ధనస్సు :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వాణిజ్య రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. విద్యార్థులు తోటివారి కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. బంధువుల రాకతో గృహంలో కొత్తఉత్సాహం, సందడి చోటు చేసుకుంటాయి. వాహనం నడునపునపుడు జాగ్రత్త అవసరం.
 
మకరం :- ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొంత మంది మిమ్మల్ని ధన సహాయం అర్ధించవచ్చు. సిమెంటు, ఇటుక, కలప వ్యాపారస్తులకు పురోభివృద్ధి. భాగస్వామిక చర్చలు, స్థిరచరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు వాయిదాపడతాయి. సన్నిహితులలో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
కుంభం :- మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. కుటుంబీకుల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. విద్యార్థులకు స్నేహ బృందాలు విస్తరిస్తాయి. లిటిగేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచటం మంచిది.
 
మీనం :- స్టాక్ మార్కెట్ రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. అందరికి సహాయం చేసి సమస్యలు ఎదుర్కొంటారు. రుణం ఏ కొంతైనా తీర్చటానికి చేసే మీ యత్నం వాయిదాపడుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కాస్మిక్ పవర్' అనే విశ్వ శక్తినిచ్చే దీపారాధన