'అన్నయ్య' పొలిటికల్ కన్‌క్లూజన్ తీసుకున్నారు: క్లారిటీ ఇచ్చిన 'తమ్ముడు'

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (12:45 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో అన్నయ్య - తమ్ముడు అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది మెగాస్టార్ - పవర్ స్టార్. వీరిద్దరూ అన్నయ్య, తమ్ముడు పేర్లతో సినిమాలు కూడా చేశారు. ఈ చిత్రాలు కూడా మంచి హిట్ కొట్టాయి. 
 
అయితే, రాజకీయాల్లోకి తొలుత అన్నయ్య వచ్చారు. ప్రజారాజ్యం పెట్టారు. 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. 18 సీట్లతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆయన మాత్రం రాజ్యసభ సభ్యుడుగా ఎంపికై కేంద్ర మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
 
ఈ నేపథ్యంలో ఇపుడు పవర్ స్టార్ జనసేన పార్టీని స్థాపించారు. ఏపీ రాజకీయాల్లో ఓ ఊపు ఊపుతున్నారు. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో ఆయనతో పాటు.. ఆయన పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దించారు. వీరి తరపున అన్నయ్య చిరంజీవి ప్రచారానికి వస్తారంటూ ప్రచారం జరిగింది. దీనిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. 
 
"జనసేన పార్టీ తరపున ప్రచారానికి అన్నయ్య వచ్చే అవకాశం లేదు. ఆయన పొలిటికల్ కన్‌క్లూజన్ ఆయన తీసేసుకున్నారు. పాలిటిక్స్‌ను నేను చూసే విధానం వేరు.. ఆయన చూసే విధానం వేరు. ఆ విషయంలో మా ఇద్దరి మధ్య స్పష్టత ఉంది. ఆయన కళాకారుడు.. నేను కళాకారుడిని కాదు. అంతే తేడా" అని పవన్ వివరించారు. సో.. జనసేన తరపున చిరంజీవి ప్రచారం చేయరనే విషయంపై క్లారిటీ వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

తర్వాతి కథనం
Show comments