Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్న చిరంజీవి!

Advertiesment
Congress
, బుధవారం, 3 ఏప్రియల్ 2019 (15:44 IST)
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతలు అందరూ ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ తప్పకుండా ఓటు వేయాల్సిందిగా వారిని అభ్యర్థిస్తున్నారు. కేవలం ఒక వారం రోజులు మాత్రమే ఎన్నికలకు గడువు ఉండడంతో నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
 
ఈ నేపథ్యంలో ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. 
 
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతు తెలుపుతూ ఆయన తరపున చిరు ప్రచారం చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు. 
 
ఈనెల 8వ తేదిన వికారాబాద్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభకి సోనియా రానున్నారు. ఈ సభకి చిరంజీవి కూడా హాజరవుతారని, ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇటీవలే కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు మరియు ఇతర అంశాలపై చర్చించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడలితో ఆ సంబంధం.. కొడుకును ఏం చేశాడంటే?