గెడ్డాం వెనుక రహస్యాన్ని బయట పెట్టిన పవన్..!

బుధవారం, 3 ఏప్రియల్ 2019 (21:55 IST)
గత నెలరోజులుగా పెద్ద గడ్డాంతో పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళుతున్నాడు. ప్రచారం చేస్తున్నాడు. ఎప్పుడు హ్యాండ్‌సమ్‌గా.. క్లీన్‌గా కనిపించే పవన్ గెడ్డాంతో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలెందుకు పవన్ అలా ఉన్నాడో ఎవరికీ అర్థం కాలేదు. కానీ తన గెడ్డం వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టాడు జనసేనాని.
 
హీరోగా ఉన్నప్పుడు రోజూ గెడ్డాం తీసుకునేవాడిని. చాలా ఇబ్బంది పడేవాడిని. రోజూ షేవింగ్ అంటే ఇబ్బందే. అందుకే ఇప్పుడు షేవ్  చేయడం లేదు. షేవ్ చేసే సమయం కూడా లేదు అంటున్నాడు పవన్ కల్యాణ్. నన్ను నాలాగే జనం ఆదరిస్తారని అనుకుంటున్నా.. హీరోనా లేక రాజకీయ నేత అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అందం అనే దాని గురించి అస్సలు మాట్లాడను అంటున్నారు పవన్ కల్యాణ్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

తర్వాతి కథనం 54 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్న బీఎస్ఎన్ఎల్