Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక నోటి నిండా గుడ్డలు అత్యాచారయత్నం...

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (13:13 IST)
జిల్లా కేంద్రమైన విశాఖపట్టణంలో ఓ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేసేందుకు విఫల ప్రయత్నం చేశాడు. ఆ బాలిక నోటి నిండా గుడ్డలు కుక్కి ఈ దారుణానికి ప్రయత్నించాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ యువకుడిపై స్థానిక పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్నం పాతనగరానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని (10) ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో తోటి బాలికతో ఆడుకుంటుండగా భూపేష్‌నగర్‌కు చెందిన రాజేష్‌ అలియాస్‌ టోని వారిని పలుకరించి, తనతో తీసుకెళ్ళాడు. 
 
కొంతదూరం నడిచివెళ్లాక... రోడ్డు పక్కనే ఉన్న ఓ పాతకారులోకి తీసుకెళ్లాడు. అక్కడ కాళ్లు చేతులకు తాడు కట్టి, నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారం చేయబోయాడు. కారు కదలికలను గమనించిన కొందరు చిన్నారులు, స్థానికులు అక్కడికెళ్లి అద్దాలపై గట్టిగా కొట్టడంతో రాజేష్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక ఏడుస్తూ ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. 
 
రాజేష్‌ను పట్టుకునేందుకు వారు ప్రయత్నించినా.. అప్పటికే అతను పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రులు మహిళా చేతన మహిళా సంఘం సాయంతో గురువారం సాయంత్రం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కేసు నమోదు చేసి.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించామని సీఐ శ్రీనివాసరావు చెప్పారు. నిందితుడిని పట్టుకోవడానికి రెండు బృందాలను పంపించామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Sobhita: తమిళ సినిమా కోసం సంతకం చేసిన శోభిత దూళిపాళ

"అర్జున్ రెడ్డి" వల్లే గుర్తింపు - క్రేజ్ వచ్చింది : షాలినీ పాండే

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments