విశాఖ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలింపు

ఆదివారం, 25 ఆగస్టు 2019 (12:07 IST)
విశాఖపట్టణం నుంచ మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన శివాజీ భుజంకాం, బాలాజీ అంకుష్‌ జాదవ్‌ విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలించేందుకు ఏర్పాట్లు చేశాడు.
 
ఇందులోభాగంగా, తుని రైల్వేస్టేషన్‌కు వస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. పట్టణ సీఐ జి.రమేష్‌ సిబ్బందితో కలిసి వారిని పట్టణంలోని శ్రీనివాస థియేటర్‌ సెంటర్‌లో అదుపులోకి తీసుకుని, 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదుచేసి కోర్టుకు హాజరుపరిచినట్టు సీఐ తెలిపారు

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆధార్ నమోదుకు తొందరవద్దు.. ప్రభుత్వం