Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలను హత్య చేస్తాడు.. ఆ తరువాత కామవాంఛ తీర్చుకుంటాడు.. సైకో కిల్లర్ అరెస్ట్

Advertiesment
మహిళలను హత్య చేస్తాడు.. ఆ తరువాత కామవాంఛ తీర్చుకుంటాడు.. సైకో కిల్లర్ అరెస్ట్
, శుక్రవారం, 23 ఆగస్టు 2019 (20:53 IST)
అతనో సైకో కిల్లర్.. మహిళలను హత్య చేయడం ఆ తర్వాత అనుభవించడం ఇది అతని శాడిజం. తమిళ హీరో కార్తీ నటించిన ఓ సినిమాలో విలన్ చేసే విధంగా ఇతను చేయడం ప్రారంభించాడు. ఇంకేముంది.. ఏపీలో నాలుగు హత్యలు, తమిళనాడులో మరో మూడు హత్యలు చేశాడు. స్నేహితులతో కలిసి హత్య చేసిన తర్వాత వారిని అక్కడి నుంచి పంపించి మహిళల శవాలను రేప్ చేసేవాడు నిందితుడు ఆనంద్.
 
మహిళలను హతమార్చిన అనంతరం కామవాంఛ తీర్చుకొని దోపిడీలకు పాల్పడుతూ పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకు తిరుగుతున్న  అంతర్రాష్ట్ర సైకోతో పాటు అతనికి సహకరించిన ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సైకో కిల్లర్‌ను, అతనికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు మీడియాకు వివరించారు.
 
జూన్ నెల 24వ తేదీ రాత్రి నగరి మండలం ఎంయన్ కండ్రిగ గ్రామంలోని పొలంలో పనిచేసుకుంటున్న సరోజమ్మను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ కేసును ఛేదించేందుకు జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు సవాల్‌గా తీసుకున్నారు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి  దర్యాప్తును ముమ్మరం చేశారు. 
 
పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తును ప్రారంభించారు. తీగ లాగితే డొంక కదిలింది. సరోజమ్మ హత్య కేసులో భర్త గోపాల్ రెడ్డి, ఆమె కుమారుడు నరసింహులు నిందితులుగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య వివాదం ఉండటం వలన భార్యను హతమార్చేందుకు గోపాల్ రెడ్డితో పాటు కుమారుడు నరసింహులు కుట్ర చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన సైకో కిల్లర్ ఆనంద్‌తో 30 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
 
ఈ మేరకు సరోజమ్మను పథకం ప్రకారం హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు నగలను దోచుకొని పరారయ్యారు. ఈ కేసు విషయమై పుత్తూరు డిఎస్పి మురళీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. సరోజమ్మ హత్య కేసులో భర్త గోపాల్ రెడ్డితో పాటు కుమారుడు నరసింహులు నిందితులుగా ఉండటం పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడు తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా అరక్కోణం పట్టణానికి చెందిన సైకో కిల్లర్ ఆనంద్, మన్నన్ కూడా  అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ చేయగా తమిళనాడు రాష్ట్రం అరక్కోణంలో మరో ఇద్దరిని హత్య చేసినట్లు, పిచ్చాటూరు మండలం గోవర్ధనగిరికి చెందిన సుభద్రమ్మ అనే మహిళపై దాడి చేసినట్లు ఒప్పుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో అన్యమత ప్రచారంపై విచారణ... దేవాదాయ శాఖమంత్రి