'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం చూస్తే చంద్రబాబు నిజస్వరూపం తెలుస్తుంది : మోహన్ బాబు

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (10:31 IST)
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని బాబు పాత్రే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసలు నైజమని సినీ నటుడు, వైకాపా నేత మోహన్ బాబు వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబుకు సంస్కారం లేదని, కన్యాదానం చేసిన మామకే వెన్నుపోటు పొడిచి టీడీపీని బలంవంతంగా తన వశం చేసుకున్నారని ఆరోపించారు. 
 
రాంగోపాల్‌వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూస్తే చంద్రబాబు నిజస్వరూపం తెలుస్తుందన్నారు. మాట తప్పని వైఎస్.జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు కులం, మతం, ప్రాంతం అంటూ విడగొడుతారని దీనిని ప్రజలంతా గమనించి వైఎస్ జగన్ గెలుపునకు కృషి చేయాలన్నారు. 
 
జగన్ మోహన్ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. అనుభవం అనేది ఏ ఒక్కరికీ ముందుగా ఉండదన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ పాలనను జగన్ మోహన్ రెడ్డి అందిస్తారని మోహన్ బాబు జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments