కోలీవుడ్ సెక్సీ హీరోయిన్ నమిత. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "సింహా". ఇందులో 'సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే...' అనే పాటతో తెలుగులో బాగా పాపులర్ అయింది.
ఆ తర్వాత ఇటు తెలుగు, అటు తమిళంలో సినీ అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె తన ప్రియుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితానికే పరిమితమయ్యారు. పైగా, గత ఎన్నికల్లో ఆమె తమిళనాడులో అధికార పార్టీకి ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఆ వేదికల మీద ఆమె అభిమానులను 'మచ్చాస్' (బావలూ) అనడం కూడా అప్పట్లో క్రేజీగా మారింది.
ప్రస్తుతం తమిళనాడులోనూ సార్వత్రిక ఎన్నికల వేడి ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా డబ్బు విపరీతంగా చేతులు మారుతోంది. దీంతో ఎన్నికల సంఘం ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించి, వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేయిస్తోంది. ఈ తనిఖీల్లో ఇప్పటికే కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ తనిఖీల్లో భాగంగా, ఇటీవల నమిత కారును కూడా ఎన్నికల అధికారులు చెక్ చేశారు. సేలం జిల్లాలోని ఏర్కాడు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. తన కారును తనిఖీ చేస్తాననడంతో నమిత కోపగించుకున్నారు. కానీ అధికారులు వివరించిన విషయాలను విన్నాక, ఆమె భర్త వీరేంద్ర కారు తనిఖీకి అనుమతించారు. అందులో స్క్వాడ్‌కు నగదుగానీ, బంగారం కానీ దొరకలేదని సమాచారం.