Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ తప్పు చేసా.. అందుకే కెరీర్‌లో వెనుకబడ్డా.. హీరోయిన్ వ్యాఖ్యలు

ఆ తప్పు చేసా.. అందుకే కెరీర్‌లో వెనుకబడ్డా.. హీరోయిన్ వ్యాఖ్యలు
, బుధవారం, 27 మార్చి 2019 (10:45 IST)
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డేకి ఇప్పుడు మహర్దశ సాగుతోంది. దాదాపు ఐదేళ్ల క్రితమే ‘ముకుందా’తో హీరోయిన్‌గా పరిచయమై, ఆ తర్వాత ‘ఒక లైలా కోసం’ అనే సినిమా చేసినా కూడా రెండు సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో మరుగున ఉండిపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా డీజే సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ వచ్చాక పూజా కెరీర్ పరుగులు పెట్టడం ఆరంభమైంది. ఆ తర్వాత ఇక జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’తో తన ఖాతాలో బ్లాక్‌ బస్టర్‌‌ను వేసుకుంది. 
 
ఈ సినిమాలో హీరోయిన్‌కు కూడా ఇంపార్టెన్స్ ఉండటంతో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చాలా క్రేజీ ప్రాజెక్ట్‌లలో హీరోయిన్‌గా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. మహర్షి సినిమా షూటింగ్ జరుగుతోంది, ఇక ప్రభాస్ సరసన మరో సినిమా చేస్తూ కెరీర్‌లో చాలా బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో సీనీరంగ ప్రవేశం చేసి ఐదేళ్ల గడుస్తున్నా మీ సినిమాల సంఖ్య ఇంకా సింగిల్‌ డిజిట్‌లోనే ఉండటానికి కారణమేంటని అడగగా.. 
 
‘‘కెరీర్ మొదట్లో బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా అవకాశమొచ్చింది. దీంతో "మొహంజదారో" సినిమా కోసం రెండు సంవత్సరాల డేట్స్ వారికి ఇచ్చేసాను. సాధారణం ఓ నటి కెరీర్‌లో రెండేళ్ల సమయం ఎంతో కీలకమైనది, ఆ విషయం తెలియక సినిమాకు సైన్ చేసాను, ఆ తర్వాత తెలిసినా ఫలితం లేకపోయింది.
 
నేను చేసిన రెండు మూడు సినిమాలు నాకు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆ తర్వాత నుండి ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాను. తొందరతొందరగా సినిమాలు చేసి, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో అంతే త్వరగా కనుమరుగవడం నాకిష్టం లేదు." అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బు మాత్రమే ముఖ్యం కాదు... అర్జున్ రెడ్డి హీరోయిన్..