జైలులో అస్వస్థతకు గురైన చంద్రబాబు.. అలర్జీ.. చికిత్స?

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (19:04 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో అస్వస్థతకు లోనయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు స్కిన్ అలెర్జీతో బాధపడుతున్నారు. 
 
గత కొన్నిరోజులుగా విపరీతమైన ఉక్కపోత, వేడిమి నెలకొని ఉండడంతో... జైలులో చంద్రబాబు డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారు. అధిక వేడిమితో ఆయన అలర్జీకి గురయ్యారు. 
 
ఈ నేపథ్యంలో, జైలు అధికారులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలకు సమాచారం అందించారు. దాంతో, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు వైద్యులు జైలులోకి వెళ్లారు.
 
మరోవైపు చంద్రబాబు పరిస్థితిని చూసి టీడీపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన తమ పార్టీ అధినేత చంద్రబాబును జైల్లోనే ఉంచి ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని టీడీపీ నేత, ఎమ్మెల్యే చినరాజప్ప మండిపడ్డారు. అందుకే ఆయనకు బెయిల్ రాకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 
 
అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్‌పై మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా దోచుకోవడం, దాచుకోవడం, దాడులు చేయడం తప్పించి చేసిన అభివృద్ధి శూన్యం అని నారా లోకేష్ పేర్కొన్నారు. 
 
సీఎంగా చేసిన మంచి పని ఒక్కటీ లేదని తెలిపారు. అసలే సైకో అయిన జగన్‌కు అధికార మదం ఎక్కిందని, ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి చేరి పిచ్చిగా వాగుతున్నాడని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments