Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబుపై అంగళ్లు కేసు : బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తి.. 13న తీర్పు

chandrababu
, గురువారం, 12 అక్టోబరు 2023 (15:04 IST)
చిత్తూరు జిల్లా అంగళ్లులో జరిగిన ఘర్షణలో కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ పూర్తయింది. తీర్పును మాత్రం ఏపీ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. గత ఆగస్టు నెల 14వ తేదీన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన చేపట్టారు. ఆ సమయంలో అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 
 
ఈ కేసులో చంద్రబాబు ఏ1గా పేర్కొంటూ మరో 179 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా, అనేక మంది టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై గురువారం సుధీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ వాదనలు ముగిసిన తర్వాత తీర్పును హైకోర్టు రేపటికి వాయిదావేసింది.రోవైపు, ఫైబర్ నెట్ పీటీ (ప్రిజనర్ ట్రాన్సిస్ట్) వారెంట్‌పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. 

మొరాదాబాద్‌లో షాకింగ్ ఘటన.. నర్సు స్నానం చేస్తుంటే వీడియో తీసిన పోలీసు 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నర్సు స్నానం చేస్తుండగా, కానిస్టేబుల్ ఒకడు వీడియో తీశాడు. తాను స్నానం చేస్తుంటే ఓ పోలీస్ కానిస్టేల్ తనను రహస్యంగా ఫోనుతో రికార్డింగ్ చేశారంటూ ఆ నర్సు ఆరోపించింది. ఈ ఘటన  నల 10వ తేదీన జరిగిందన్నారు. బాధితురాలు మొరాదాబాద్‌లోని జిల్లా ఆస్పత్రిలో నర్సుగా చేస్తుది. 
 
నిందితుడు తన పొరుగింట్లో ఉంటాడని, అతడు తన సహోద్యోగి భర్తే అని ఆమె చెప్పింది. ఆ రోజు ఉదయం స్నానం చేసి దుస్తులు ధరిస్తూ తెరపైకి చూడగా ఓ కెమెరా కనిపించిందని చెప్పింది. వెంటనే తాను బాత్రూమ్ బయటకు వచ్చి చూడగా పొరుగింటి లోపలి నుంచ గొళ్లెం పెట్టి ఉందని చెప్పింది. 
 
అక్కడే ఉన్న ఓ మహిళను తలపులు తెరవమని చెప్పి లోపలికి వెళ్ళి చూడగా నిందితుడు కనిపించాడని పేర్కొంది. తాను అతడిని సెల్‌ఫోన్ చూపించమని కోరగా నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడని చెప్పింది. ఆ వెంటనే ఆమె సివిల్ పోలీస్ లైన్స్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోడ్డు ప్రమాద బాధితుడి అవశేషాలను కాలువలో పడేస్తారా?