Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేశ్ నిందితుడు కాదు.. కోర్టుకు తెలిపిన సీఐడీ

nara lokesh
, బుధవారం, 4 అక్టోబరు 2023 (10:21 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటివరకు నిందితుడిగా లేరని హైకోర్టుకు సీఐడీ తెలిపింది. ఒకవేళ ఆయనను కనుక నిందితుల జాబితాలో చేర్చాలనుకుంటే నిబంధనల ప్రకారం సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారిస్తామని సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. 
 
దీంతో 41ఏ నిబంధనల మేరకు నడుచుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ కే సురేశ్ రెడ్డి సీఐడీని ఆదేశించారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ లోకేశ్ మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో సీఐడీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
 
విచారణలో లోకేశ్ తరపు న్యాయవాది గురుకృష్ణకుమార్ తన వాదనలు వినిపిస్తూ 41ఏ పేరుతో లోకేశను పిలిచి నిబంధనలకు కట్టుబడలేదన్న సాకుతో అరెస్టు చేసే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. 41ఏ(3)(4) నిబంధనలను ఒకేసారి సూచిస్తూ నోటీసు ఇస్తున్నారని, ఆ తర్వాత అందులోని నిబంధనలకు కట్టుబడలేదన్న సాకుతో అక్రమంగా అరెస్టు చేస్తున్నారని వాదించారు.
 
2021లో నమోదైన ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటివరకు 94 మంది సాక్షులను సీఐడీ విచారించిందని, వారిలో ఒక్కరు కూడా పిటిషనర్ పేరు చెప్పలేదన్నారు. ఇప్పుడు రాజకీయ కారణాలతో లోకేశ్ పేరును లాగుతున్నారని వివరించారు. కాబట్టి లోకేశ్ అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలను నివారించాలని హైకోర్టును కోరారు. స్పందించిన ఏజీ శ్రీరామ్ 41 ఏకు కట్టుబడి ఉంటామని కోర్టుకు తెలపడంతో ఈ వ్యాజ్యాన్ని కోర్టు మూసివేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ పెళ్లికి వద్దన్నారనీ ముస్లిం ప్రియుడి ఆత్మహత్య.. హిందూ ప్రియురాలు కూడా..