మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పర్యటన

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (18:52 IST)
తెలంగాణలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దాదాపు ఐదు రోజుల పాటు మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో రాహుల్ గాంధీ మిజోరంలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
 
అక్టోబరు 17న జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశానికి గాంధీ హాజరవుతారని, అనంతరం సాయంత్రం తెలంగాణకు బయలుదేరి వెళతారని ఆ వర్గాలు తెలిపాయి. 
 
అక్టోబరు 18, 19, 20 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణలో కాంగ్రెస్ బస్సుయాత్ర కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అక్టోబర్ 18న జరిగే బస్సు యాత్రలో ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొనే అవకాశం ఉంది.
 
 అక్టోబర్ 16న రాజస్థాన్‌లో జరిగే బహిరంగ సభలో పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తారు.118 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, 40 మంది సభ్యులున్న మిజోరాం, 200 మంది రాజస్థాన్ అసెంబ్లీలకు నవంబర్ 7న, నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments