Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం కోసం ధరలు ఖరారు చేసిన ఈసీ : చికెన్ బిర్యానీ రూ.140

telangana assembly
, గురువారం, 12 అక్టోబరు 2023 (14:24 IST)
తెలంగాణ అసెంబ్లీకి వచ్చే నెలాఖరులో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపునకు ఆయా పార్టీల ముమ్మరంగా ప్రచారం చేయనున్నాయి. అయితే, ఈ ప్రచారం కోసం ఒక్కో అభ్యర్థి ఖర్చు చేసే మొత్తంలో కోత విధించింది. తప్పుడు లెక్కలతో ప్రచార వ్యయాన్ని తగ్గించి చూపే అవకాశం లేకుండా ధరల జాబితాను విడుదల చేసింది. ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలకు కాఫీ, టీ, టిఫిన్, బిర్యానీ తదితర వాటికి దేనికెంత అనే వివరాలతో ఒక పట్టికను రూపొందించింది. ఇందులో పేర్కొన్న ధరల ప్రకారమే అభ్యర్థి తన ఖర్చులకు లెక్కలు చూపించాల్సి ఉంటుంది. ఈ ఖర్చు రూ.40 లక్షలకు మించకూడదని తెలిపింది. ఎన్నికల సంఘం విడుదల చేసే జాబితాలో ధరల ఇలా ఉన్నాయి. 
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే సభలలో వేటికి ఎంత ఖర్చు చేయాలన్న ధరలు పరిశీలిస్తే, 
 
ఫంక్షన్ హాల్ రూ.15 వేలు, భారీ బెలూన్ రూ.4 వేలు, ఎల్.ఈ.డీ తెర రూ.15 వేలు, డీసీఎం వ్యాను రూ.3 వేలు, మినీ బస్సు రూ.3500, పెద్ద బస్సు రూ.6 వేలు, ఇన్నోవా రూ.6 వేలు, డ్రోన్ కెమెరా రూ.5 వేలు, పెద్ద సమోసా రూ.10 వేలు, లీటర్ వాటర్ బాటిల్ రూ.20, పులిహోర రూ.30, గ్రామీణ ప్రాంతాల్లో అయితే, పులిహోర రూ.20, టిఫిన్ రూ.35, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30, సాదా భోజనం రూ.80, వెజిటబుల్ బిర్యానీ రూ.80, గ్రామీణ ప్రాంతాల్లో రూ.70, చికెన్ బిర్యానీ రూ.140, గ్రామాల్లో రూ.100, మటన్ బిర్యానీ రూ.180, గ్రామీణ ప్రాంతాల్లో రూ.150 చొప్పున ఖర్చు చేయాల్సివుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దసరా స్పెషల్ : విజయవాడకు 1000 ప్రత్యేక బస్సులు