కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనకు సంభంధించి షెడ్యూల్ ఖారరైంది. మంగళవారం మధ్యాహ్నం అదిలాబాద్‌లోని డైట్ కళాశాల మైదానంలో జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శంషాబాద్‌లోనూ అదే రోజు అమిత్ షా సభ నిర్వహించాలని బీజేపీ భావించింది. కానీ ఈ సభ రద్దయింది. దీనికి బదులు సిఖ్ విలేజ్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 7.30 గంటలకు తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో ఐటీసీ కాకతీయలో సమావేశం కానున్నారు.
అమిత్ షా షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే,
మంగళవారం మధ్యాహ్నం గం.1.45 కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం గం.2.35కు ప్రత్యేక హెలికాప్టరులో అదిలాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం గం.3 కు గం.4 వరకు అదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. గం.4.15కు అదిలాబాద్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గం.5.05కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గం.5.20 నుంచి సాయంత్రం గం.6 వరకు ఐటీసీ కాకతీయలో సమావేశం. గం.6 కు ఇంపీరియల్ గార్డెన్ చేరుకుంటారు. గం.6.20 నుంచి గం.7.20 వరకు ఇంపీరియల్ గార్డెన్‌లో సమావేశం. రాత్రి గం.7.40 సమయానికి ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ. రాత్రి గం.9.40కి బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.