Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యంత అరుదైన క్యాన్సర్ లియోమియోసార్కోమాకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

Advertiesment
Doctor
, బుధవారం, 11 అక్టోబరు 2023 (18:10 IST)
విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) మంగళగిరి ఎడమ ఊపిరితిత్తుల దిగువ భాగంలో మెటాస్టాటిక్ లియోమియోసార్కోమాకు విజయవంతంగా చికిత్స చేసింది. లియోమియోసార్కోమా, లేదా LMS అనేది మృదువైన కండరాలలో పెరిగే అరుదైన క్యాన్సర్. ఈ మృదువైన కండరాలు  శరీరం లోని ప్రేగులు, కడుపు, మూత్రాశయం మరియు రక్తనాళాలతో సహా శరీరంలోని బోలు అవయవాలలో ఉంటాయి. ఆడవారిలో, గర్భాశయంలో కూడా ఈ  మృదువైన కండరం ఉంటుంది.
 
61 ఏళ్ల పురుషుడు, శ్రీ శ్రీహరి గుణశేఖర్ 2020లో లియోమియోసార్కోమాతో బాధపడ్డారు. ఆయన కొత్త సమస్యతో AOIకి వచ్చారు. చెక్-అప్ సమయంలో అతని ఎడమ ఊపిరితిత్తులో కొత్త సమస్య కనిపించింది. డాక్టర్ కళ్యాణ్ పోలవరపు- డాక్టర్ అమిత్ పాటిల్ నేతృత్వంలోని వైద్యుల బృందం అతని సంక్లిష్టమైన కేసును సవాల్‌గా తీసుకుంది. ఊపిరితిత్తుల సమస్యతో పాటు, శ్రీ చంద్రశేఖర్‌కు బృహద్ధమని, గుండె కవాటాలతో కూడా సమస్యలు ఉన్నాయి. వ్యక్తిగతీకరించిన చికిత్స ప్రణాళిక కోసం కార్డియాలజిస్ట్‌ని కూడా సంప్రదించవలసి వచ్చింది.
 
ఆయనకు నాలుగు అంచెల కీమోథెరపీతో చికిత్స ప్రారంభించబడింది. తర్వాత PET CT స్కాన్‌ల ద్వారా క్షుణ్ణంగా తిరిగి పరీక్షలు చేయటం జరిగింది. ప్రోత్సాహకరంగా ఫలితాలు కనిపించాయి. మరే ఇతర భాగంలోనూ వ్యాధి ఉన్నట్లు రుజువు కాలేదు. కానీ, గుండె కవాటాలు, ఇరుకైన బృహద్ధమనితో సమస్యలు ఉన్నందున, ఈ కేసు ప్రమాదకరంగా పరిగణించబడింది. AOI మంగళగిరిలోని అంకితమైన వైద్య బృందం రోగి యొక్క పరిస్థితిని నిశితంగా పరిశీలించి, శస్త్రచికిత్సకు ముందు విస్తృతమైన రీతిలో పరీక్షలు నిర్వహించింది.
 
డాక్టర్ కళ్యాణ్ పోలవరపు మాట్లాడుతూ "ఈ విజయగాథ AOI మంగళగిరిలోని మొత్తం వైద్య బృందం యొక్క సహకార ప్రయత్నం. ఈ రోగికి ఇన్వాసివ్ సర్జికల్ టెక్నిక్‌లను ఉపయోగించడం వల్ల త్వరగా కోలుకోవడం జరిగింది, ఇది శస్త్రచికిత్స సమయంలో అతి తక్కువగా రక్త నష్టం కావటంతో పాటుగా శస్త్రచికిత్స తర్వాత నొప్పిని సైతం తగ్గిస్తుంది. శస్త్రచికిత్స అనంతర రోజు నుండి ప్రోత్సాహక రీతిలో స్పిరోమెట్రీ నిర్వహించగల సామర్థ్యం ఫలితంగా మిగిలిన ఎడమ ఊపిరితిత్తి యొక్క సరైన విస్తరణ జరిగి, శస్త్రచికిత్స అనంతర ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించింది" అని అన్నారు. 
 
పలు పరిశీలనల తర్వాత, శ్రీ గుణశేఖర్ సాధారణ అనస్థీషియా కింద ఎడమ ఊపిరితిత్తుల దిగువ లోబెక్టమీకి VATS (వీడియో-అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ) చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతర రికవరీ అనూహ్యంగా, సాఫీగా సాగింది, శస్త్రచికిత్స అనంతర 5వ రోజున ఇంటర్‌కోస్టల్ డ్రెయిన్(ICD)ని తొలగించడం, శస్త్రచికిత్స తర్వాత 8వ రోజున డిశ్చార్జ్ చేయడం జరిగింది.
 
AOI యొక్క రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(RCOO) శ్రీ  మహేందర్ రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, "అత్యంత సవాలుతో కూడిన సందర్భాలలో కూడా ఖచ్చితమైన క్యాన్సర్ సంరక్షణను అందించడంలో AOI స్థిరంగా తన నిబద్ధత చాటుతుంది. ఈ విజయవంతమైన ఫలితం ఆవిష్కరణ మరియు ఆంకోలాజికల్ కేర్‌లో శ్రేష్ఠత పట్ల మా అంకితభావాన్ని నొక్కి చెబుతుంది" అని అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాఫీలో కొబ్బరినూనె కలిపి తాగితే..?