Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రక్ డ్రైవర్లతో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకున్న HDB ఫైనాన్షియల్ సర్వీసెస్

image
, గురువారం, 28 సెప్టెంబరు 2023 (21:26 IST)
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా, భారతదేశంలోని ప్రముఖ NBFC, HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ (HDBFS), కమ్యూనిటీ కోసం ఉచిత ఫిజియోథెరపీ శిబిరాలను నిర్వహించడం ద్వారా ట్రక్ డ్రైవర్‌ల కృషి మరియు అంకితభావాన్ని గుర్తించే అవకాశాన్ని పొందింది. HDB యొక్క ప్రతిష్టాత్మక CSR ప్రోగ్రామ్- రవాణా ఆరోగ్య కేంద్రం (TAK) క్రింద ఈ శిబిరాలు నిర్వహించబడ్డాయి.
 
డ్రైవర్స్ శారీరక ఆరోగ్యం మెరుగుపరచటం, కోర్ కండరాలను బలోపేతం చేయడం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే గాయాలను నివారించడం లక్ష్యంతో, HDBFS 14 రాష్ట్రాల్లోని 35 ప్రధాన రవాణా నగర్‌లలో ట్రక్ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఉచిత ఫిజియోథెరపీ సెషన్‌లను నిర్వహించింది.
 
ఈ కార్యక్రమం గురించి  హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్, హెడ్ అసెట్-  ఫైనాన్స్ అజయ్ ఠాకూర్ మాట్లాడుతూ, "ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం వ్యక్తుల శ్రేయస్సును నిర్ధారించడంలో ఫిజియోథెరపీ పోషించే కీలక పాత్రను గుర్తిస్తుంది, ముఖ్యంగా ట్రక్ డ్రైవింగ్ వంటి శారీరక శ్రమతో కూడిన వృత్తులలో!  మన హైవే హీరోల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి మరియు వారికి మద్దతివ్వడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన CSR కార్యక్రమం ట్రాన్స్ పోర్ట్  ఆరోగ్య కేంద్ర. ట్రక్కింగ్ కమ్యూనిటీ నుండి వచ్చిన అపూర్వమైన స్పందనను దృష్టిలో ఉంచుకుని, రాబోయే సంవత్సరాల్లో మరింత ఎక్కువ మంది ట్రక్ డ్రైవర్లను చేరుకోవడానికి HDB తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది." అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉసిరికాయతో నెయ్యి లడ్డూలు ఎలా చేయాలంటే?