Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ పెద్ద వయసు వ్యక్తులకు ఎఎంఎల్ చికిత్స

Advertiesment
Dr Prahallad
, గురువారం, 31 ఆగస్టు 2023 (19:24 IST)
అక్యూట్ మైలోయిడ్ లుకేమియా(AML), ఫిస్టులా (పెరియానాల్  అబ్సస్) సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల మహిళకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ గుంటూరు విజయవంతంగా చికిత్స చేసింది. AOI విప్లవాత్మక చికిత్సా విధానం ఎఎంఎల్ చికిత్సా విధానాన్ని మార్చడమే కాకుండా భారతదేశంలోని వయోధిక రోగుల చికిత్సలో విప్లవాత్మక మార్పులనూ చేసింది.
 
కావ్య రెడ్డి (పేరు మార్చబడింది) ఫిస్టులా సమస్యలతో పాటు ఎఎంఎల్ తో పోరాడుతున్నారు. అత్యంత సంక్లిష్టమైన వైద్య స్థితి ఆమెది. పాయువు చుట్టూ ఉన్న కణజాలాలలో చీము గడ్డలు ఏర్పడ్డాయి. ఈ చీము ప్రభావిత ప్రాంతంలో నొప్పి, వాపు ఉండటంతో పాటుగా ఎర్రగా మారి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. నిపుణులైన ఆంకాలజిస్టులు, హెమటాలజిస్టులు, సపోర్టివ్ కేర్ నిపుణులతో కూడిన AOI గుంటూరు యొక్క మల్టీడిసిప్లినరీ బృందం తక్కువ-తీవ్రత నియమాలు, తాజా లక్ష్య అణువులను కలుపుకొని ఒక విప్లవాత్మక చికిత్స వ్యూహాన్ని రూపొందించింది. కేవలం 5 రోజుల వ్యవధిలో, రోగి సంప్రదాయ కీమోథెరపీ నియమావళికి విరుద్ధంగా వినూత్న లక్ష్యంతో ఒక ప్రత్యేకమైన ప్రోటోకాల్‌ను అనుసరించారు.
 
"ఈ కేసులో, ఎఎంఎల్ తో బాధ పడుతున్న వయోధిక రోగికి చికిత్స చేయడంలోని సవాళ్లను మేము గుర్తించాము, ఇక్కడ సాంప్రదాయ కీమోథెరపీ సంబంధిత సమస్యలు ఆమెకు ప్రాణాంతకంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని గమనించటం జరిగింది" అని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ గుంటూరు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాంప్రహ్లాద్ కెఎం తెలిపారు. "తక్కువ-తీవ్రత నియమావళితో టార్గెటెడ్ థెరపీని ఏకీకృతం చేయడంపై మా విధానం ఆధారపడింది. ఎముక మజ్జ నుండి బ్లాస్ట్ సెల్స్ మాయమైపోవడంతో ఫలితాలు మా అంచనాలను మించిపోయాయి. ఇది పూర్తి ఉపశమనానికి దారితీసింది. ఇది ఎఎంఎల్ చికిత్సలో, ప్రత్యేకించి భారతదేశంలో 60 సంవత్సరాల వయస్సు పైబడిన రోగులకు ఒక సంతోషకరమైన క్షణంగా నిలుస్తుంది" అని అన్నారు. 
 
సాంప్రదాయ కెమోథెరపీ, ముఖ్యంగా "3+7" నియమావళి ప్రకారం, వయోధిక ఎఎంఎల్ రోగులలో గణనీయమైన మరణాల రేటు కనిపిస్తుంది. అయితే, AOI గుంటూరు యొక్క వినూత్న విధానం తక్కువ దుష్ప్రభావాలతో మంచి ఫలితాలను ప్రదర్శించింది. రోగి యొక్క విజయవంతమైన రికవరీ, శ్రేష్ఠత పట్ల AOI అంకితభావాన్ని వెల్లడించడమే కాకుండా, అత్యాధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకురావటానికి, సరసమైనదిగా చేయడానికి దాని నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. 
 
"వయోధిక ఎఎంఎల్ రోగుల చికిత్సలో మేము పరివర్తనాత్మక పురోగతిని చూశామని వెల్లడించడానికి నేను సంతోషిస్తున్నాను" అని గుంటూరులోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ప్రాంతీయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. "ఆవిష్కరణ- రోగి-కేంద్రీకృత సంరక్షణపై మా అచంచలమైన దృష్టి సాంప్రదాయ కీమోథెరపీకి అనర్హులుగా భావించిన వారికి ఆశాజనకమైన చికిత్సా విధానాన్ని పరిచయం చేయడానికి మాకు వీలు కల్పించింది. AOI గుంటూరు రోగుల ఫలితాలు, జీవన నాణ్యతను మెరుగుపరిచే మార్గదర్శక ఆవిష్కరణలు చేయటానికి అంకితం చేయబడింది" అని అన్నారు. 
 
పేషెంట్ ఫస్ట్ విధానంతో సరికొత్త వైద్యపరమైన పురోగతిని మిళితం చేసే ప్రపంచ-స్థాయి ఆరోగ్య సంరక్షణను అందించాలనే దాని దృష్టికి నిదర్శనంగా AOI గుంటూరు యొక్క ఈ విజయగాథ నిలుస్తుంది. ఈ విజయం, వయోధిక AML రోగులకు చికిత్స అవకాశాలపరంగా కొత్త శకానికి నాంది పలికింది, సంప్రదాయ కెమోథెరపీ దుష్పరిణామాల ప్రభావాలు లేకుండా వారికి ఉపశమనం పొందే అవకాశాన్ని అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేనెను మితిమీరి సేవిస్తే ఏమవుతుందో తెలుసా?