దేశంలో 40 అనుమానిత ఒమిక్రాన్ కేసులు - 10 మంది ముంబైకర్లకు పాజిటివ్

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (14:41 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే బెంగుళూరులో ఒక వైద్యుడితో పాటు ఇద్దరికి ఈ వైరస్ సోకింది. దీంతో దేశంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించినట్టు నిర్ధారణ అయింది. ఇపుడు దేశ వ్యాప్తంగా 40కిపైగా అనుమానితి ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు ఉన్నట్టు సమాచారం. ఈ కేసుల్లో మహారాష్ట్రలో 28, ఢిల్లీలో 12 చొప్పున ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం. 
 
మహారాష్ట్రలో అనుమానిస్తున్న 28 ఒమిక్రాన్ కేసుల్లో ఏకంగా 10 మంది రోగులు రాజధాని ముంబైకు చెందిన వారే కావడం గమనార్హం. అలాగే, ఢిల్లీలో 12 అనుమానిత కేసులను గుర్తించారు. వీరందరినీ లోక్ నాయక్, జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం ఎనిమిది అనుమానితులను ఆస్పత్రిలో చేర్చగా శుక్రవారం మరో నలుగురిని తరలించారు.
 
ఇదిలావుంటే, గురువారం ఒక్క రోజే వివిధ దేశాల నుంచి 861 మంది ప్రయాణికులు దేశంలోకి వచ్చారు. వీరిందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా, ఇందులో 28 మందికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఈ 28 మందిలో 25 మంది అంతర్జాతీయ ప్రయాణికులు కాగా, మరో ముగ్గురు వారి కాంటాక్ట్‌లని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments