హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ తయారు చేసిన 'కోవాగ్జిన్' కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని గుడ్‌న్యూస్ చెప్పింది. అందుబాటులో ఉన్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా కోవాగ్జిన్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది.
అయితే, ఒమిక్రాన్‌పై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మరిన్ని నమూనాలను స్వీకరించి పరీక్షించాల్సి ఉందని, అప్పుడే మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.
దీనిపై ఐసీఎంఆర్ అధికారి మాట్లాడుతూ ''కోవాగ్జిన్ అనేది వైరియన్ -ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఇది మొత్తం వైరస్‌ను అంతం చేసేలా కవర్ చేస్తుంది. ఇది అత్యంత పరివర్తన చెందిన కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంది." అని వివరించారు.
కోవాగ్జిన్ కేవలం ఒమిక్రాన్‌పైనే కాదు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వంటి ఇతర వేరియంట్లపై కూడా బాగా పనిచేస్తుందని అధికారి పేర్కొన్నారు.