Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో ఫిబ్రవరి - ఏప్రిల్‌లో 'ఒమిక్రాన్' థర్డ్ వేవ్?

Advertiesment
Omicron
, శుక్రవారం, 3 డిశెంబరు 2021 (09:26 IST)
భారత్ ఒమిక్రాన్ వేరియంట్ ముప్పును తప్పించుకునేలా కనిపించడం లేదు. వచ్చే యేడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో థర్డ్ వేవ్ తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఒమిక్రాన్ వైరస్ దేశంలోకి ప్రవేశించింది. అందువల్ల మరో వేవ్ ముంచుకురానున్నదన్న భయాలు నెలకొనివున్నాయని చెబుుతున్నారు.
 
నిజానికి కరోనా సంక్షోభం మొదలైన తర్వాత అమెరికా, ఐరోపా దేశాల్లో ముందుగానే కరోనా వేవ్‌లు వచ్చాయి. ఆ తర్వాత మన దేశంలో నాలుగైదు నెలల తర్వాత ఈ వేవ్‌లు వచ్చాయి. ఇపుడు కూడా ఒమిక్రాన్ వేవ్ విదేశాల్లో మొదలైంది. అలాగే, భారత్‌లో కూడా ఆలస్యంగా వెలుగు చూసే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
గతవారంలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే ఆఫ్రికా, ఐరోపా దేశాలను వణికిస్తుంది. అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ కొత్త వేరియంట్ తొలుత వెలుగు చూసిన సౌతాఫ్రికాలో ఈ కేసుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి. అలాగే, గడిచిన 9 రోజుల్లో ఈ వైరస్ 30 దేశాల్లో వెలుగు చూసింది. అంటే.. ఈ వైరస్ ఎంత శరవేగంగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 
 
గతంలో అమెరికా, బ్రిటన్, భారత్ వంటి దేశాల్లో కరోనా సృష్టించిన ఉధృతి అంతాఇంతా కాదు. దీనికి ఆయా దేశాల్లో నమోదైన గణాంకాలే నిదర్శనం. అంతేకాకుడా, ఫస్ట్ వేస్, సెకండ్ వేవ్‌ల మధ్య సరాసరి గడువు ఆరు నెలల నుంచి 8 నెలల వరకు ఉంది.
webdunia
 
దీన్ని నిశితంగా పరిశీలిస్తే, రెండో వేవ్ తగ్గిన 6 లేదా 8 నెలల్లో అంటే 2022 ఫిబ్రవరి - ఏప్రిల్ నెలల మధ్య మూడో వేవ్ ఉధృతి రావొచ్చన్న వాదనలకు బలం చేకూరుతుంది. అయితే, ఒమిక్రాన్ వ్యాప్తి, దీనివల్ల సంభవించే మరణాలు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయం తెలియాలంటే మరో వారం పది రోజుల పాటు ఆగాల్సివుంటుంది. 
 
అయితే, ముఖానికి మాస్క్, భౌతికదూరం పాటిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వైరస్‌ను కట్టడి చేయొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో అమెరికాలో ఫస్ట్ వేస్ 2020 జూలైలోను, సెకండ్ వేవ్ 2021 జనవరిలోనూ, థర్డ్ వేవ్ 2021 సెప్టెంబరులో మొదలైంది. 
 
అలాగే, బ్రిటన్‌లో ఫస్ట్ వేవ్ 2020 ఏప్రిల్, సెకండ్ వేవ్ జనవరి 2021, థర్డ్ వేవ్ 2021 ఆగస్టులో మొదలైంది. కానీ భారత్‌లో మాత్రం ఫస్ట్ వేవ్ 2020 సెప్టెంబరు, సెకండ్ వేవ్ 2021 మే మొదలుకాగా, థర్డ్ వేవ్ మాత్రం 2022 ఫిబ్రవరి - ఏప్రిల్ నెలల్లో ప్రారంభంకావొచ్చని ఓ అంచనా వేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గత చంద్రబాబు సర్కారు వల్లే పోలవరం పూర్తికాలేదు : మంత్రి అనిల్ కుమార్